వైఎస్సార్ 'యాత్ర'లో సన్నీ లియోన్ అనుకుని..

వైఎస్సార్ 'యాత్ర'లో సన్నీ లియోన్ అనుకుని..

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నిజం కూడా అనుమానాలకు బలాన్ని ఇవ్వడం పెద్ద షాక్. ఇదిగో సన్నీ లియోన్ ని మమ్ముట్టితో చూసి అనుమానంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ మలయాళం మెగాస్టార్ యాత్ర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. దివంగత ఉమ్మడి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఆ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది.

అయితే యాత్ర చిత్ర యూనిట్ ఈ మద్యే సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలెట్టింది. ఇక ప్రచార సమయంలో మమ్ముంటి హడావుడి గట్టిగానే ఉంటుంది అని అందరూ అనుకోవడం సహజం. కానీ యాత్ర హీరో సడన్ గా సన్నీలియోన్ తో కనిపించడంతో షాక్ అయ్యారు. కొందరైతే అది యాత్ర సినిమాకు సంబంధించినదని కూడా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. మమ్ముంటి పంచె కట్టు చూసి అది నిజమని చాలామంది అనుకున్నారు. చివరికి అది మలయాళం సినిమా అని తెలుసుకొని  మిగతా వారికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మమ్ముట్టి సొంత భాషలో నటిస్తున్న మధురరాజాకి సంబంధించిన లొకేషన్ స్టిల్ ఇది. షూటింగ్ స్పాట్ లో ఇద్దరు కనిపించిన ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. గతంలో వచ్చిన పొక్కిరి రాజా సినిమాకు మధుర రాజా సీక్వెల్ గా రూపొందుతోంది. సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ ని రూపొందిస్తున్నారు. అందులో సన్నితో మమ్ముట్టి స్టెప్ వేయనున్నారు. ఇది అసలు మ్యాటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English