లేటు వయసులో పెద్ద బ్రేకే

లేటు వయసులో పెద్ద బ్రేకే

వరుసగా ప్లాప్స్ అందిన కూడా హీరో నుంచి అభిమానులు కోరుకునే ఒక్క సినిమా వస్తే చాలు ఎన్ని ప్లాప్స్ వచ్చినా క్రేజ్ తగ్గదని వెంకటేష్ ఇప్పుడు ప్రూవ్ చేశాడు. F2 సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన వెంకీ తదుపరి తన స్టామినా చూపించడానికి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ని ఒకే చేస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న స్టార్స్ లిస్ట్ లో వెంకీ పేరు ఉందంటే చూస్కోండి.

F2 సినిమాతో 70 కోట్ల లాబాల్ని అందిస్తే ఎవరు మాత్రం ఆఫర్ ఇవ్వకుండా ఉంటారు. సో ఈ విక్టరీ గారి ముందు ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ అలా వాలిపోతున్నాయి. మెయిన్ గా కామెడీ ఎంటర్టైనర్ కథలు మనోడిని ఉరిస్తున్నాయట. అయితే వెంకీ మాత్రం చాలా ఆలోచించి అడుగేస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ తన మేనల్లుడితో వెంకీ మామ ఫినిష్ చేయడానికి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ముందే ఒక ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్న ఈ దగ్గుబాటి హీరో ఆ తరువాత త్రినాథరావు నక్కిన తో మరో ఎంటర్టైన్మెంట్ ను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

త్రినాథరావు ఇటీవల లైన్ అయితే వినిపించాడు. ఆ కథకు ఇంకా వెంకీ అఫీషియల్ గా సైన్ చేయలేదు. దాదాపు ఈ కథలన్నీ అభిమానులు కోరుకుంటున్న విధంగానే వెంకటేష్ ఒకే చేసినట్లు ఉంది. F2 ఈ రేంజ్ లో వెంకీని చేంజ్ చేస్తుందని ఎవరు ఉహించలేదు. అందుకే ఇప్పుడు లేటు వయసులో భలే గట్టి బ్రేక్ వచ్చిందని అందరూ అంటున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English