ప్యాడింగ్‌తో రామ్‌ చరణ్‌ సేవ్‌ అయ్యాడు

ప్యాడింగ్‌తో రామ్‌ చరణ్‌ సేవ్‌ అయ్యాడు

'వినయ విధేయ రామ' చిత్రం అల్టిమేట్‌గా అట్టర్‌ ఫ్లాప్‌ అయినా తెలుగు రాష్ట్రాల్లో గౌరవప్రదమైన వసూళ్లనే రాబట్టుకోగలిగింది. కానీ యుఎస్‌లో మాత్రం అత్యంత దారుణంగా డిజాస్టర్‌ అయి బయ్యర్‌ని రోడ్డున పడేసింది. పెద్ద సినిమాల ప్రీమియర్‌ కలక్షన్లలో సగం కూడా ఫుల్‌ రన్‌లో దీనికి రాలేదు. ఈ చిత్రం 'రంగస్థలం' తర్వాత రావడం రామ్‌ చరణ్‌ అదృష్టమని చెప్పాలి. అదే అతను ఫ్లాపుల్లో వుండగా ఈ చిత్రం వచ్చినట్టయితే చరణ్‌ మార్కెట్‌ పాతాళానికి పడిపోయేది. బ్రూస్‌లీ టైమ్‌లో మెగా అభిమానులే చరణ్‌పై ఆశలు వదిలేసుకున్నట్టు కనిపించింది.

రంగస్థలంలో అభిమానులనే కాకుండా అందరినీ మెప్పించి చరణ్‌ తిరిగి టాప్‌ స్టార్స్‌ రేస్‌లోకి వెళ్లడం జరిగింది. 'వినయ విధేయ రామ' మళ్లీ అతడిని ఒక రెండు అడుగులు వెనక్కి లాగినా కానీ 'రంగస్థలం' మెగా సక్సెస్‌ వల్ల దీని ప్రభావం అతనిపై పెద్దగా వుండదనాలి. పైగా తదుపరి చిత్రం రాజమౌళిది కనుక దీని గురించి ఫాన్స్‌ బెంగ పడాల్సిన పని లేకుండా పోయింది. అలా అనుకోకుండా ఈ చిత్రానికి ముందు, వెనక మంచి సినిమాల ప్యాడింగ్‌ వుండడం చరణ్‌ని సేవ్‌ చేసింది. ఇదే ఫ్లాప్‌ ధృవ తర్వాత వచ్చినా కానీ చరణ్‌ చిత్రాలకి యుఎస్‌లో కనీస ధర పలికేది కాదని విశ్లేషకుల అనాలిసిస్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English