బాలకృష్ణపై ఇలాగే ఫైర్‌ అవగలడా?

బాలకృష్ణపై ఇలాగే ఫైర్‌ అవగలడా?

కంగన రనౌత్‌పై క్రిష్‌ పోరాటం రసకందాయంలో పడింది. సినిమా ఇంకా థియేటర్లలో వుండగానే దర్శకుడిగా తనకి జరిగిన అన్యాయం, అవమానం గురించి క్రిష్‌ ఏకరువు పెడుతున్నాడు. క్రిష్‌ మాటలని బట్టి కంగన అడిగిన కొన్ని మార్పులు చేయడానికి క్రిష్‌ అంగీకరించలేదు. 'మరీ మొండిగా వ్యవహరిస్తున్నావ్‌' అని ఆమె అంది అని తనే చెబుతున్నాడు. దీనిని బట్టి క్రిష్‌ ఎప్పుడయితే ఎన్టీఆర్‌ సినిమా కోసమని పక్కకి వెళ్లాడో కంగన టేకోవర్‌ చేసి తనకి కావాల్సినట్టుగా 'మణికర్ణిక'ని మార్చేసుకుందని అర్థమవుతోంది. క్రిష్‌ ఆవేదన సబబుగానే అనిపిస్తున్నా కానీ కొందరు నెటిజన్లు 'మరి ఎన్టీఆర్‌ విషయంలో అంతే కటవుగా ఎందుకు వుండలేకపోయావ్‌' అని క్రిష్‌ని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

కంగన అడిగిన మార్పులు చేయడానికి అక్కడ అంగీకరించనపుడు 'ఎన్టీఆర్‌' చిత్రాన్ని తన విజన్‌తో కాకుండా బాలకృష్ణ సూపర్‌విజన్‌తో ఎందుకు చేయాల్సి వచ్చిందని, విడుదలకి రెండు నెలల ముందు వరకు లేని రెండు భాగాల ఐడియాని అప్పుడెందుకు ప్రోత్సహించావని, బాలకృష్ణకి ఎదురు చెప్పి సినిమా బెనిఫిట్‌ కోసం ఆలోచించి వుండాల్సిందిగా అని అడుగుతున్నారు. రెండు భాగాలుగా విడదీయడం వల్ల ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెంటికీ చెడ్డ రేవడిగా మారిందని విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్‌ చిత్రం రూపకల్పనలో బాలయ్య అతి జోక్యం వల్ల దర్శకుడు తేజ తప్పుకున్న తర్వాత క్రిష్‌ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మణికర్ణిక పూర్తి చేయకుండా అవకాశం వచ్చిందని ఎన్టీఆర్‌ చిత్రాన్ని ఎలా మొదలు పెట్టావని, మణికర్ణిక పూర్తి చేసాకే వస్తానని బాలయ్యకి చెప్పి వుండాల్సిందిగా అంటూ లాజిక్‌ మాట్లాడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English