దిల్‌ రాజు ఫెయిలవుతున్నది అందుకే

దిల్‌ రాజు ఫెయిలవుతున్నది అందుకే

నిర్మాతగా దిల్‌ రాజుకి ఎదురు లేదు. ఒకటీ అరా ఫ్లాపులు వచ్చినా కానీ వెంటనే మరో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చి తన గ్రాఫ్‌ నిలబెట్టుకుంటాడు. గత యేడాది వచ్చిన పరాజయాలని మరపించే విజయాన్ని 'ఎఫ్‌ 2'తో అందుకున్నాడు. రెండు రెట్ల లాభాన్ని అందుకున్న ఈ చిత్రం తెచ్చిన లాభాల్లో కొంత 'వినయ విధేయ రామ'ని కొని పోగొట్టుకున్నాడు. సంక్రాంతి సినిమాల్లో ఏదో ఒకటి డిస్ట్రిబ్యూట్‌ చేయడానికి 'వినయ విధేయ రామ'ని దిల్‌ రాజు ఎంచుకున్నాడు. నైజాం, ఉత్తరాంధ్ర హక్కులని దాదాపు ముప్పయ్‌ కోట్లకి కొన్నాడు. కానీ తిరిగి వచ్చిన ఇరవై ఒక్క కోట్ల పైచిలుకు.

అంటే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ చిత్రంపై నష్టపోయాడు. ఇందులో రికవరీ ఏమైనా వుందా లేదా అనేది తెలియదు. అయితే నిర్మాతగా అంత సక్సెస్‌ఫుల్‌ అయిన దిల్‌ రాజు పంపిణీదారునిగా ఎందుకు ఫెయిలవుతున్నట్టు? పంపిణీ రంగంలో మాత్రమే వున్నపుడు మార్కెట్‌ స్టడీ చేయడానికి టైమ్‌ వుండేదని, ఏ సినిమా బాగుంది, ఏదు లేదనేది తెలుసుకుని, ఒక్కోసారి సినిమా చూసి రైట్స్‌ తీసుకునేవాడినని, అందువల్ల అప్పట్లో ఎక్కువ సక్సెస్‌లు వచ్చేవని, కానీ ఇప్పుడు సమయం లేక వున్న వాటిలో ఏది బెటర్‌ అనేది ఒక అంచనాకి వచ్చి కొంటున్నానని, ఇది రివర్స్‌ అవుతోందని, నిర్మాతగా బిజీ అయినా పంపిణీ రంగాన్ని విడిచి పెట్టరాదనే ఇంకా డిస్ట్రిబ్యూటర్‌గా వున్నానని దిల్‌ రాజు చెబుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English