రాజమౌళి కోర్టులో 'బిగ్‌బాస్‌'

రాజమౌళి కోర్టులో 'బిగ్‌బాస్‌'

బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి ఇంకా హోస్ట్‌ ఖాయం కాలేదు. తదుపరి సీజన్‌కి పనులు మొదలు పెట్టాల్సిన తరుణం ఆసన్నం అవుతూ వుండడంతో మొదటి సీజన్‌ని అద్భుతంగా హోస్ట్‌ చేసిన ఎన్టీఆర్‌తోనే మూడవ సీజన్‌ చేయించాలని స్టార్‌ మా నెట్‌వర్క్‌ చూస్తోంది. ఎన్టీఆర్‌ కూడా సానుకూలంగానే వున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ఒక దఫా చర్చలు కూడా జరిగాయట. అయితే ఎన్టీఆర్‌ ఈ సీజన్‌ హోస్ట్‌ చేసేదీ లేనిదీ రాజమౌళిపై ఆధారపడి వుందట.

వారాంతాల్లో ఒక్క రోజు మాత్రం తమకి ఇవ్వాలని బిగ్‌బాస్‌ ఎన్టీఆర్‌ని అడిగిందట. అందుకు తారక్‌ సుముఖంగానే వున్నా 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ షెడ్యూల్‌ అందుకు అనుగుణంగా మార్చుకోవాల్సి వుంటుంది. శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నాలుగేసి గంటలు ఇవ్వాలని కోరారట. ఆదివారం ఫరవాలేదు కానీ శనివారం షూటింగ్స్‌కి అంతరాయం ఏర్పడే అవకాశం వుందని, మిగిలిన యాక్టర్ల డేట్స్‌ క్లాష్‌ అయితే షెడ్యూల్‌ అప్‌సెట్‌ అవుతుందని రాజమౌళి అభిప్రాయపడినట్టు భోగట్టా. అయితే బిగ్‌బాస్‌ హోస్ట్‌ చేయాలనే తారక్‌ ఉత్సాహం చూసి ఏమైనా చేయగలమేమో చూద్దామని, అప్పుడే మాట ఇవ్వవద్దని రాజమౌళి అతడికి చెప్పినట్టు భోగట్టా. రాజమౌళి కనుక గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తే ప్రతి వీకెండ్‌ ఎన్టీఆర్‌ని బుల్లితెరపై చూసే మహద్భాగ్యం అభిమానులకి దక్కుతుందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English