‘యాత్ర’కు నో అన్న ఆ స్టార్ ఎవరు?

 ‘యాత్ర’కు నో అన్న ఆ స్టార్ ఎవరు?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఇందులో వైఎస్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషించిన సంగతి తెలిసిందే. ఐతే తెలుగులో ఇంతమంది నటులుండగా.. ఓ తెలుగు ముఖ్యమంత్రి పాత్రకు మలయాళ నటుడిని తీసుకోవడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి.

ఐతే తాము అలాంటి ప్రయత్నం చేయకుండానే మమ్ముట్టిని సంప్రదించలేదని అంటున్నాడు దర్శకుడు మహి.వి.రాఘవ్. తెలుగులో ఒక ప్రముఖ కథానాయకుడిని వైఎస్ పాత్ర కోసం అడిగామని.. కానీ ఆయన వైఎస్ పాత్ర పోషించడం వల్ల తలెత్తే పరిణామాల గురించి ఆలోచించుకుని నో అన్నారని మహి చెప్పాడు. తెలుగులో ఇంకే నటుడు కూడా వైఎస్ పాత్ర చేయడానికి ముందుకొచ్చే పరిస్థితి కనిపించలేదన్నాడు.

వైఎస్‌ గొప్పదనాన్ని చూపించే సినిమా ఇదని.. ఆ పాత్ర చేస్తే తమపై ఒక ముద్ర పడొచ్చన్న ఉద్దేశంతో తెలుగు నటులెవరూ ఈ క్యారెక్టర్ చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణమన్నాడు. ఐతే తెలుగు హీరోలెవరూ వైఎస్ పాత్ర చేయకపోవడం మంచిదే అని.. వాళ్లు చేస్తే ఇమేజ్ అడ్డొచ్చేదని.. మమ్ముట్టి చేయడం వల్ల ఎలాంటి బ్యాగేజ్ అన్నది కనిపించదని.. తెర మీద కేవలం వైఎస్ మాత్రమే కనిపిస్తాడని అన్నాడు మహి.

వైఎస్ పాత్ర కోసం మమ్ముట్టి గొప్ప కమిట్మెంట్ చూపించారని.. వైఎస్ బాడీ లాంగ్వేజ్‌ను పర్ఫెక్టుగా మ్యాచ్ చేయడమే కాక.. తెలుగు నేర్చుకుని ఆయన లాగే డైలాగులు కూడా చెప్పారని.. అలాంటి నటుడు ఈ పాత్ర చేయడం తన అదృష్టమని మహి చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English