‘దేవదాసు’ కాబోతున్న అక్కినేని హీరో?

‘దేవదాసు’ కాబోతున్న అక్కినేని హీరో?

అక్కినేని నాగచైతన్య కెరీర్ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. గత ఏడాదిన్నరలో అతడికి ఏమాత్రం కలిసి రాలేదు. ‘యుద్ధం శరణం’.. ‘సవ్యసాచి’ లాంటి డిజాస్టర్లను.. ‘శైలజారెడ్డి అల్లుడు’ లాంటి ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నాడతను. ఇప్పుడు అతడి ఆశలన్నీ తన భార్య సమంతతో కలిసి నటిస్తున్న ‘మజిలీ’ మీదే ఉన్నాయి.

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రామిసింగ్‌గానే కనిపిస్తోంది. దీని తర్వాత చైతూ తన మావయ్య విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామ’ అనే సినిమా చేయడబోతున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ తర్వాత చైతూ చేయబోయే సోలో హీరో మూవీ.. లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథతో తెరకెక్కబోతునట్లుగా వార్తలొస్తున్నాయి.

తన దర్శకత్వంలో ‘రాజన్న’ చేసిన నాగార్జున అడగడంతో చైతూ కోసం విజయేంద్ర ప్రసాద్ ఓ కథ రాసినట్లు సమాచారం. ఇది ఏఎన్నార్ ఆల్ టైం క్లాసిక్ ‘దేవదాసు’ స్ఫూర్తితో తీర్చిదిద్దిన లవ్ స్టోరీ అని సమాచారం. మోడర్న్ దేవదాసు కథగా దీన్ని చూడొచ్చని అంటున్నారు. చైతూ లవ్ స్టోరీలతోనే చాలా వరకు కెరీర్లో విజయాలందుకున్నాడు. యాక్షన్, వేరే జానర్ సినిమాలు ట్రై చేసిన ప్రతిసారీ ఎదురు దెబ్బలే తిన్నాడు.

ఈ నేపథ్యంలో అతను మళ్లీ ప్రేమకథల వైపు చూస్తున్నాడు. విజయేంద్ర ప్రసాద్ కథలు ఎప్పుడూ కూడా అంత కొత్తగా ఏమీ ఉండవు. పాత కథల్నే రీసైకిల్ చేసి కొంచెం డిఫరెంటుగా తీర్చిదిద్దుతుంటారు. ‘దేవదాసు’ కథను కూడా ఆయన అలాగే మార్చి చైతూ కోసం కొంచెం కొత్తగా రాసినట్లు సమాచారం. ఈ కథను తెరకెక్కించే దర్శకుడెవరన్నది ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం రావచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English