టాలెంటెడ్ డైరెక్టర్ అడుగులు ఎటువైపు?

టాలెంటెడ్ డైరెక్టర్ అడుగులు ఎటువైపు?

‘కార్తికేయ’ లాంటి సెన్సేషనల్ మూవీతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు చందూ మొండేటి. ఐతే తొలి సినిమాతో సత్తా చాటిన చాలామంది దర్శకులు ద్వితీయ విఘ్నం దాటలేక ఇబ్బంది పడ్డవాళ్లే. అందులోనూ ‘ప్రేమమ్’ లాంటి క్లాసిక్‌ను రీమేక్ చేయాల్సి రావడంతో చందూ ఇబ్బంది పడతాడని అనుకున్నారంతా. కానీ చందూ మాత్రం ఆ గండాన్ని సులువుగానే దాటేశాడు. వరుసగా రెండో సక్సెస్ కొట్టాడు.

కానీ ఊహించని విధంగా అతడికి తృతీయ విఘ్నం బ్రేక్ వేసింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ‘సవ్యసాచి’ ఫ్లాప్ అయింది. దీంతో చందూ అయోమయంలో పడ్డాడు. ముందు అనుకున్న ప్రకారం అయితే చందూ నాలుగో సినిమా ‘కార్తికేయ-2’ కావాల్సింది.

కానీ దాన్ని హోల్డ్‌లో పెట్టి వేరే శర్వానంద్ హీరోగా ఓ వైవిధ్యమైన సినిమా చేయడానికి చందూ రెడీ అయ్యాడని.. ఈ చిత్రాన్ని ‘పడి పడి లేచె మనసు’ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తాడని ప్రచారం జరిగింది. ఈ సినిమా ప్రకటన రావడమే తరువాయి అనుకుంటుండగా.. శర్వానంద్ ‘96’ రీమేక్‌లో నటించబోతున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో చందూ-శర్వా సినిమా మీద నీలినీడలు కమ్ముకున్నాయి.

ఐతే చందూ-శర్వా సన్నిహితుల సమాచారం ప్రకారం వీరి సినిమా కొంచెం ఆలస్యమవుతుందట కానీ.. క్యాన్సిల్ కాలేదట. ‘96’ రీమేక్ అయ్యాక శర్వా.. చందూతోనే పని చేయాలని కోరుకుంటున్నాడట. శర్వా ఫ్రీ కావడానికి ఆలస్యమయ్యేట్లుంటే సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా చేయాలని కూడా చందూ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు ఆప్షన్లలో ఏది ముందు సెట్టయ్యేట్లుంటే.. ఏది బెటర్ అనుకుంటే దాన్నే అతను ఎంచుకోబోతున్నట్లు సమాచారం. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English