సోగ్గాడి కంటే మన్మథుడే బెటర్‌

సోగ్గాడి కంటే మన్మథుడే బెటర్‌

సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్‌తో పాటు మన్మథుడు సీక్వెల్‌కి కూడా నాగార్జున కాంపౌండ్‌లో ఒకేసారి వర్క్‌ జరుగుతోంది. సోగ్గాడే తీసిన కళ్యాణ్‌ కృష్ణ 'బంగార్రాజు' స్క్రిప్ట్‌ రెడీ చేస్తోంటే, రాహుల్‌ రవీంద్రన్‌ ఏమో 'మన్మథుడు' పార్ట్‌ 2 సిద్ధం చేస్తున్నాడు. ఈ రెండిట్లో ఏది ముందు చేయాలనే దానిపై నాగార్జునకి కాస్త కన్‌ఫ్యూజన్‌ వుండేది. అయితే సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్‌కి సంబంధించిన ఐడియా ఇంకా వేగ్‌గానే వుందట. దానిపై క్లారిటీ రావడానికి టైమ్‌ పడుతుంది కనుక మన్మథుడు సీక్వెల్‌కి నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసాడు. ఈసారి ఈ చిత్రాన్ని పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరించనున్నారు.

నాగార్జున ఇందులో మిడిల్‌ ఏజ్డ్‌ మన్మథుడిగా కనిపిస్తారు. హాలీవుడ్‌లో జార్జ్‌ క్లూనీ చేసే తరహా పాత్రలకి తగ్గట్టుగా రాహుల్‌ రవీంద్రన్‌ ఈ క్యారెక్టర్‌ డిజైన్‌ చేసాడట. నాగార్జున లుక్‌ పరంగా కూడా ఇందులో మార్పు వుంటుందని, ఇన్నాళ్లు యంగ్‌ లుక్‌లోనే కనిపించిన నాగ్‌ ఈసారి కాస్త ఏజ్డ్‌ లుక్‌తోనే కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఈమధ్య సినిమాలు తగ్గించేసిన నాగార్జున ఈ కథ షేప్‌ తీసుకుంటోన్న తీరు పట్ల చాలా హ్యాపీగా వున్నట్టు తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English