క్రిష్‌ సైలెంట్‌గా వుంటే బాగుండేదేమో

క్రిష్‌ సైలెంట్‌గా వుంటే బాగుండేదేమో

'మణికర్ణిక' చిత్రంపై కురుస్తోన్న ప్రశంసలకి థాంక్స్‌ అంటూ క్రిష్‌ ఒక ట్వీట్‌ పెట్టాడు. దాంతో సినిమాని మధ్యలో ఆపేసి వచ్చేసిన మీకు ఆ ప్రశంసలని స్వీకరించే హక్కు లేదంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం రావడంతో 'మణికర్ణిక' చిత్రాన్ని పూర్తి చేయకుండా క్రిష్‌ వచ్చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన సినిమాని కంగన పూర్తి చేసుకోవడంతో పాటు క్రిష్‌ తీసిన పలు దృశ్యాలని కూడా రీషూట్‌ చేసింది. డెబ్బయ్‌ శాతం చిత్రాన్ని తానే డైరెక్ట్‌ చేసానంటూ కంగన చెబుతోంది.

దర్శకత్వంలో తన పేరుతో పాటు కంగన కూడా క్రెడిట్‌ తీసుకున్నాక దాని గురించి మాట్లాడని క్రిష్‌ ఇప్పుడా చిత్రానికి ప్రశంసలు రావడంతో ఇలా తన క్రెడిట్‌ కోసం చూస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకాలం ఎలాగైతే సైలెంట్‌గా వున్నాడో, సినిమా రిలీజ్‌ అవుతుందన్నా ఎంత సైలెంట్‌గా వుండిపోయాడో, విడుదలయ్యాక కూడా అతను అలాగే మౌనంగా వుంటే బాగుండేదేమో అంటున్నారు అతనిపై వస్తోన్న విమర్శలు సహించలేని వారు. మణికర్ణిక వదిలేసి వచ్చి ఎన్టీఆర్‌ తీసిన క్రిష్‌కి ఆ సినిమాతో పరాజయమే దక్కింది. అదే అగ్రిమెంట్‌ ప్రకారం హిందీ చిత్రాన్నే పూర్తి చేసినట్టయితే ఇవాళ వస్తోన్న ప్రశంసలకి క్రిష్‌ పాత్రుడయి వుండేవాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English