ఫ్లాప్‌ని లెక్క చేయని బాలకృష్ణ

ఫ్లాప్‌ని లెక్క చేయని బాలకృష్ణ

'వినయ విధేయ రామ' చిత్రాన్ని అందరూ విమర్శించేలా, తన ప్రతిభని శంకించేలా తీసిన బోయపాటి శ్రీను బ్రాండ్‌ ఇమేజ్‌ బాగా దెబ్బ తినేసింది. అతనితో పని చేయడానికి స్టార్‌ హీరోలు ప్రస్తుతం ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. అయితే బోయపాటి శ్రీనుతో తదుపరి చిత్రం చేస్తానని ముందే మాట ఇచ్చిన బాలకృష్ణ మాత్రం అతని ఫ్లాప్‌ని లెక్క చేయడం లేదు. 'వినయ విధేయ రామ' రిజల్టుతో పని లేకుండా బాలకృష్ణ ముందు అనుకున్నట్టుగా బోయపాటి శ్రీను చిత్రాన్ని ట్రాక్‌ ఎక్కిస్తున్నాడు. బోయపాటి గత చిత్రం వల్ల అతని మార్కెట్‌ ఎఫెక్ట్‌ అవుతుందని కానీ, అతని సినిమా పట్ల మునుపటి ఆసక్తి వుండదని కానీ బాలయ్య ఆలోచించడం లేదు.

మాట ఇచ్చేసారు కనుక దానికి కట్టుబడి ఈ చిత్రాన్ని మొదలు పెట్టనున్నారు. ఎన్టీఆర్‌ మహానాయకుడు విడుదలైన తర్వాత ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని మొదలు పెట్టి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. సింహా, లెజెండ్‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కనుక సంక్రాంతికి విడుదల చేస్తే మాగ్జిమమ్‌ మైలేజ్‌ వస్తుందని అలా ప్లాన్‌ చేస్తున్నారు. ఎలాగో ఇటీవల ప్రతి సంక్రాంతికి బాలయ్య సినిమా రావడం ఆనవాయితీగా మారిపోయిందిగా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English