త్రివిక్రమ్‌... వాట్‌ ఏ ఫాల్‌!

త్రివిక్రమ్‌... వాట్‌ ఏ ఫాల్‌!

థియేటర్లలో ఎలా ఆడినా కానీ త్రివిక్రమ్‌ సినిమాలకి టీవీలో వేసినప్పుడు మంచి గిరాకీ వుంటుంది. టీవీలో అత్యధిక సార్లు ప్రసారం చేసిన దానికి ఏదైనా రికార్డు వుంటే 'అతడు' చిత్రానికే అది దక్కుతుంది. అంతగా అరగదీసేసిన అతడు ఎన్నో ఏళ్ల ప్యాకేజీ అయిపోయిన తర్వాత కూడా మరోసారి భారీ రేట్‌కి అమ్ముడుపోయింది. త్రివిక్రమ్‌ సినిమాలన్నిటికీ టీవీలో రిపీట్‌ వ్యూస్‌ వుండేవి. జల్సా, ఖలేజా, అఆ, అత్తారింటికి దారేది... ఇలా అన్ని సినిమాలకీ రేటింగ్స్‌ అదిరిపోయేవి.

అలాంటిది 'అరవింద సమేత'కి మాత్రం టీవీ రేటింగ్‌ చాలా వీక్‌గా వచ్చింది. భారీ సినిమాలకి పంతొమ్మిది, ఇరవైకి పైగా రేటింగ్స్‌ వస్తోంటే, అరవింద సమేత ఫస్ట్‌ ప్రీమియర్‌కి 13.7 రేటింగ్‌ వచ్చింది. కనీసం వేరే సినిమాల మాదిరిగా ఇది అమెజాన్‌లోనో, మరో దాంట్లోనో కూడా రిలీజ్‌ కాలేదు. అయినా కానీ వీక్‌ రేటింగ్‌ రావడాన్ని బట్టి చూస్తే త్రివిక్రమ్‌ పట్టు కోల్పోయాడనే సంగతి స్పష్టమవుతోంది. అల్లు అర్జున్‌ సినిమాతో అయినా త్రివిక్రమ్‌ తిరిగి పూర్వ వైభవం సాధించుకుంటాడని అభిమానులు, అతడిని గురూజీగా పిలుచుకునే ఏకలవ్య శిష్యులు ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English