టెన్షన్‌లో నందమూరి హీరో

టెన్షన్‌లో నందమూరి హీరో

బాగా కష్టపడతాడని నందమూరి అభిమానులు అతడిని ఇష్టపడతారు. అయితే వారికి ఉన్న ఇష్టాన్ని తన సక్సెస్‌గా మార్చుకోవడంతో నందమూరి కళ్యాణ్‌రామ్‌ విఫలమవుతున్నాడు. స్వయంగా సినిమాలు నిర్మిస్తున్న కళ్యాణ్‌రామ్‌ ఫాన్స్‌ని మెప్పించే చిత్రం అందించలేకపోతున్నాడు. అతని తాజా చిత్రం 'ఓం' త్వరలో విడుదల కానుంది. త్రీడీలో రూపొందిన ఈ యాక్షన్‌ సినిమా కోసం కళ్యాణ్‌ రామ్‌ తన ప్రాణం పెట్టేశాడని చెప్పాలి. ఈ చిత్రానికి భారీగా ఖర్చయింది. పని చేసిన నిపుణులు అంతా విదేశాలకి చెందిన వారే. క్యారెక్టర్‌ కోసం గుండు కూడా కొట్టించుకున్నాడు కళ్యాణ్‌ రామ్‌.

రెండేళ్ల పాటు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంపై కోట్లకి కోట్లు ఖర్చు పెట్టేశాడు. తన మార్కెట్‌ వేల్యూకి మూడింతల ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సినిమా బంపర్‌ హిట్‌ అయితే తప్ప కళ్యాణ్‌రామ్‌ సేఫ్‌ అవడు. తన పని తాను రాజీ పడకుండా చేసిన కళ్యాణ్‌రామ్‌ ఇప్పుడు ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందోనని టెన్షన్‌ పడుతున్నాడు. అతని కష్టం వృధా అవకూడదనే కోరుకుందాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు