అక్కినేని కాంపౌండ్ నుంచి బయటికి..

అక్కినేని కాంపౌండ్ నుంచి బయటికి..

సినీ పరిశ్రమలో ఎక్కడ కొత్త టాలెంట్ కనిపించినా.. వెంటనే కర్చీఫ్ వేసేస్తుంటాడు అక్కినేని నాగార్జున. గతంలో తన కోసమే ఇలా యంగ్ డైరెక్టర్లపై కన్నేసేవాడు. గత కొన్నేళ్ల నుంచి తన కొడుకులిద్దరి గురించి కూడా ఆలోచిస్తూ యువ దర్శకులను లైన్లో పెడుతున్నాడు. గత కొన్నేళ్లలో చాలామంది యువ దర్శకులు ఇలాగే నాగార్జున నుంచి అవకాశాలు అందుకున్నారు. అందులో చందూ మొండేటి కూడా ఒకడు.

‘కార్తికేయ’తో సత్తా చాటిన చందూ.. వెంటనే నాగచైతన్యతో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. తన తర్వాతి రెండు సినిమాలూ అతడితోనే చేశాడు. ఐతే పెద్దగా అంచనాలు లేని ‘ప్రేమమ్’ బాగా ఆడితే.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘సవ్యసాచి’ నిరాశ పరిచింది. నిజానికి ‘సవ్యసాచి’ చేస్తున్న టైంలో అక్కినేని ఫ్యామిలీ చందూను అంత ఈజీగా వదిలేలా కనిపించలేదు. నాగార్జునకు పెద్ద అభిమాని అయిన చందూ.. ఆయనతో కూడా ఒక సినిమా చేస్తాడని, అఖిల్‌తో కూడా ఒక సినిమా చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది.

కానీ ‘సవ్యసాచి’ డిజాస్టర్ కావడంతో చందూపై అక్కినేని వారి పట్టు సడలినట్లుంది. అతనిప్పుడు అక్కినేని కాంపౌండ్ నుంచి బయటికి వచ్చి శర్వానంద్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇటీవలే చందూ-శర్వా మధ్య కథా చర్చలు జరిగినట్లు..  ఇద్దరూ కలిసి ఒక వైవిధ్యమైన సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం శర్వా.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ మూవీ చేస్తున్నాడు. సుధీర్‌కు చందూ క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అతడి ద్వారా ఇద్దరి మధ్య మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

సుధీర్ సైతం తొలి సినిమా ‘స్వామి రారా’ తర్వాత వెంటనే నాగార్జున నుంచి పిలుపు అందుకుని చైతూతో ‘దోచేయ్’ తీశాడు. అది డిజాస్టర్ కావడంతో వెంటనే సైడైపోయాడు. చందూ విషయానికి వస్తే.. అతను ‘సవ్యసాచి’ తర్వాత నిఖిల్‌తో ‘కార్తికేయ-2’ చేస్తాడని వార్తలొచ్చాయి. ఐతే ఆ స్క్రిప్టు సరిగా రాకపోవడంతో ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టి శర్వాతో సినిమా వర్కవుట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English