కియారా అనే నేను.. అప్సెట్ అయ్యాను

కియారా అనే నేను.. అప్సెట్ అయ్యాను

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ గర్ల్ కియారా అద్వానీ సెకండ్ సినిమాతో మాత్రం ఒక్కసారిగా డిజాస్టర్ ని అందుకుంది. రామ్ చరణ్ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను చవిచూసింది. మినిమామ్ గ్యారెంటి హిట్ అని అంతా అనుకున్నప్పటికి చరణ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది.

VVR హిట్టయితే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవచ్చని అనుకున్న కియారా ఆశలు రెండో అడుగుకె నీరుగారిపోయాయి. ఓ విధంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలకు కియారా ప్రేరణగా నిలుస్తోంది అని అనుకునే లోపే ఉహించని అపజయాన్ని అందుకుని షాక్ తినేసింది. అమ్మడి గ్లామర్ కూడా సినిమాలో పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో చాలా డిస్సప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు తెలుగు కథలను చాలానే విన్న ఈ క్యూట్ గర్ల్ ఇంకా ఏ ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు.

అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కియారా అద్వానీని సెలెక్ట్ చేసుకునేందుకు త్రివిక్రమ్ తన టీమ్ తో చర్చలు జరిపాడు. మరి ఇప్పుడు ప్లాప్ రావడంతో డ్రాప్ అవుతారా లేక బేబీకి బ్రేక్ ఇస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం కియారా హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ తో పాటు అక్షయ్ కుమార్ కొత్త సినిమా గుడ్ న్యూస్ లో కూడా నటిస్తోంది. అలాగే ఇంకొన్ని సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English