మిష్టర్ మజ్నూ.. స్లో పాయిజన్

మిష్టర్ మజ్నూ.. స్లో పాయిజన్

ఒక్క హిట్టు దొరికితే చాలు అని కసి మీద ఉన్న యువ హీరో అఖిల్ ఇప్పుడు మిస్టర్ మజ్ను పై చాలా నమ్మకంతో ఉన్నాడు. అఖిల్ - హలో ఇచ్చిన రిజల్ట్ తో విసిగిపోయిన ఈ కుర్ర హీరో తనదైన శైలిలో ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటూ సినిమాకు బజ్ క్రియేట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే సినిమా స్లో పాయిజన్ గా జనాలకు ఎక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది

సినిమాకు ప్రస్తుతానికైతే అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా రావడం లేదు. అయితే కొన్ని అడ్వాంటేజెస్ వల్ల సినిమా క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టవ్వడం పక్కా అని టాక్ వస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం మంచి సినిమాలు ఏమి లేవు. F2 సందడి కూడా తగ్గుతోంది. మెయిన్ గా యూత్ఫుల్ సినిమాలు లేవు. ఈ జానర్ సినిమాలు వచ్చి చాలా కాలమవుతోంది. సో అఖిల్ కి కలిసొచ్చే అంశాలు ఉన్నాయి. పైగా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ లుక్స్ అండ్ ప్లే బాయ్ గా అతను చేస్తోన్న అల్లరి స్క్రీన్ పై ఆకట్టుకుంటుందని ఓ టాక్ వైరల్ అయ్యింది.

అదే విధంగా తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను ను తెరకెక్కించడంతో ఓ వర్గం వారిలో అంచనాలు బాగానే ఉన్నాయి. ఫస్ట్ వీక్ గడిస్తేనే కానీ సినిమా రిజల్ట్ పై ఒక నిర్ణయం రాకపోవచ్చు. ఫైనల్ గా కంటెంట్ క్లిక్ అయితేనే అఖిల్ కి ఫస్ట్ హిట్ మాములుగా ఉండదని చెప్పవచ్చు. సో లెట్స్ వెయిట్ అండ్ సి..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English