వినయ విధేయ భామ.. వెరీ అప్‌సెట్‌

వినయ విధేయ భామ.. వెరీ అప్‌సెట్‌

'వినయ విధేయ రామ' అంతటి డిజాస్టర్‌ అయినా మెగా ఫాన్స్‌ కానీ, చరణ్‌ కానీ అంతగా వర్రీ అవడం లేదు. కారణం... రంగస్థలంతో నాన్‌ బాహుబలి హిట్టు కొట్టి ఎంతో కాలం అవలేదు. పైగా 'వినయ విధేయ రామ' పూర్తిగా దర్శకుడి ఫెయిల్యూర్‌ అంటూ విమర్శల పాలయిందే తప్ప చరణ్‌కి ప్రత్యేకించి చెడ్డ పేరు రాలేదు. ఈ చిత్రంతో బోయపాటి బ్రాండ్‌ ఇమేజ్‌కి భారీ నష్టమే జరిగింది. అయితే ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న హీరోయిన్‌ కియారా అద్వానీ మాత్రం చాలా డిజప్పాయింట్‌ అయింది.

'భరత్‌ అనే నేను' చిత్రంతో తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టిన కియారాకి రెండవ చిత్రంతోను పెద్ద హిట్‌ వచ్చి వుంటే ఆమె ఇప్పుడు మోస్ట్‌ డిమాండ్‌ వున్న నటి అయ్యేది. ఇప్పటికీ కియారా పేరు పరిశీలిస్తున్న పెద్ద సినిమాలు వున్నాయి కానీ ఇదయితే ఆమెని బాగా డిజప్పాయింట్‌ చేసింది. బోయపాటి శ్రీనుకి వున్న ట్రాక్‌ రికార్డ్‌, చరణ్‌ సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ చూసి ఈ చిత్రం తనకి కెరియర్‌ డిఫైనింగ్‌ సినిమా అవుతుందని ఆమె ఎక్స్‌పెక్ట్‌ చేసింది. ఇకపై కాంబినేషన్లు నమ్మి సినిమాలు చేయరాదని ఆమె నిర్ణయించుకుంది. ఇదిలావుంటే హిందీలో అర్జున్‌ రెడ్డి రీమేక్‌లో కియారా చూపించనున్న బోల్డ్‌నెస్‌కి బాలీవుడ్‌కే మతి పోతుందని ఇన్‌సైడర్స్‌ ఫీలర్లు ఇస్తున్నారు. మరి ఆ స్థాయిలో కియారా ఏమి చేసేస్తోందో ఏమిటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English