త్రివిక్రమ్ ని టచ్ చేస్తాడా?

త్రివిక్రమ్ ని టచ్ చేస్తాడా?

అక్కినేని నాగార్జున నెక్స్ట్ తన కెరీర్ కి బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన మన్మథుడు సీక్వెల్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి వార్తలు రాగానే  అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో రెట్టింపవుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మన్మథుడులో నాగ్ రొమాంటిక్ టచ్ అలాగే అందులో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు. అర నిమిషం కనిపించే సైడ్ క్యారెక్టర్ కూడా ఆ సినిమాలో నవ్వించే వెళుతుంది.

అయితే కొత్త దర్శకుడు రాహుల్ రవిచంద్రన్ సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ లో కూడా నాగ్ ని ఎక్కువగా ఆ విషయాలే ఆకట్టుకున్నాయని టాక్. మొదట చిన్న లైన్ తో మన్మథుడు 2 కి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న ఈ డైరెక్టర్ నాగ్ తో నెల రోజులు స్క్రిప్ట్ డిస్కషన్స్ చేశాడట. రొమాంటిక్ టచ్ తో పాటు అందుకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే అని ఇద్దరు మాట్లాడుకున్న తరువాతే మంచి స్క్రిప్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ యువ రైటర్-డైరక్టర్ త్రివిక్రమ్ స్థాయిని ఇప్పుడు అందుకుంటాడా లేదా అనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మన్మథుడు అంటే ఆ మ్యాజిక్ కనిపించాల్సిందే. లేకపోతే జనాలకు ఎక్కదు.

నాగార్జున కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో ఏ విధంగా ఆలోచిస్తాడో గాని రాహుల్ విషయంలో మాత్రం స్క్రిప్ట్ లో చిన్న లైన్ వినగానే ఒకే చేశాడట. చి.లా.సౌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ కి ఇప్పుడు బంపర్ ఆఫర్ దొరికినట్లే అని చెప్పవచ్చు. ఈ సినిమా గనక క్లిక్ అయితే రాహుల్ కు నాగ చైతన్య - అఖిల్ డేట్స్ కూడా ఈజీగా దొరికేస్తాయ్..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English