అయిదు ఫ్లాపుల తర్వాత అదృష్ణం

అయిదు ఫ్లాపుల తర్వాత అదృష్ణం

మొదట్లో విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్‌ టాప్‌ లీగ్‌కి చేరిపోతుందనే నమ్మకం కలిగించిన మెహ్రీన్‌ ఆ తర్వాత ఫ్లాపుల వలయంలో పడిపోయింది. గత రెండేళ్లలో వచ్చిన ఆమె సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. వరుసగా అయిదు ఫ్లాప్‌ సినిమాలతో ఐరెన్‌ లెగ్‌ అనిపించేసుకుంటోన్న దశలో మెహ్రీన్‌కి కొత్త సంవత్సరం బ్లాక్‌బస్టర్‌తో మొదలయింది. 'హనీ ఈజ్‌ది బెస్ట్‌' అంటూ 'ఎఫ్‌2'లో ఆమె అల్లరి అభినయం కుర్రాళ్లని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవడంతో ఆమె 'లెగ్గు'పై వున్న అనుమానాలు పటాపంచలయ్యాయి.

దీంతో తనతో సినిమా తీస్తే ఫ్లాప్‌ అవుతుందనే డౌట్‌ వున్న నిర్మాతలకి అలాంటి జంకు వుండదు కనుక ఇకపై అవకాశాలు పెరుగుతాయి. ఈ చిత్రం సక్సెస్‌లో మెహ్రీన్‌ వాటా ఏమీ వుండదు కానీ సక్సెస్‌ఫుల్‌ సినిమాలో భాగం కావడం వల్ల ఖచ్చితంగా లాభాలుంటాయి. బ్లాక్‌బస్టర్‌తో మొదలైన ఈ యేడాది ఇలాగే విజయాలతో కొనసాగి మళ్లీ తనకి వరుస అవకాశాలు తెచ్చిపెడుతుందని మెహ్రీన్‌ ఆశిస్తోంది. పనిలో పనిగా కాస్త యాక్టింగ్‌ కూడా నేర్చుకుంటే క్యూట్‌ ఫేస్‌కి అది మరికాస్త హెల్ప్‌ అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English