బాలకృష్ణ వారికి హ్యాండ్‌ ఇచ్చేసాడా?

బాలకృష్ణ వారికి హ్యాండ్‌ ఇచ్చేసాడా?

'ఎన్టీఆర్‌' మొదటి భాగం తీవ్రంగా నిరాశ పరిచి యాభై కోట్లకి పైగా నష్టాన్ని బయ్యర్లకి మిగల్చడంతో రెండవ భాగాన్ని అదే పంపిణీదారులకి ఉచితంగా ఇచ్చేసిన సంగతి తెలిసిందే. రెండవ భాగంతో కనుక మొదటి భాగంతో వచ్చిన నష్టాలు పూడి, లాభాలు వస్తే అప్పుడు తనకి ఎంతో కొంత ఇవ్వవచ్చునని బాలయ్య డిసైడ్‌ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బయ్యర్ల గురించి ఇలా ఆలోచించే నిర్మాతలుండాలని, నిర్మాతగా తొలి చిత్రంతోనే బాలకృష్ణ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

లోకల్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అందరికీ ఇది శుభవార్త అయినా కానీ ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్‌కి కాంపన్సేషన్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. రెండు భాగాలకీ కలిపి గుత్తంగా పద్ధెనిమిది కోట్లకి ఈ చిత్రం రైట్స్‌ తీసుకున్నారు. మొదటి భాగానికి తొమ్మిది కోట్లు అనుకున్నా కానీ దాని మీదే నికరంగా అయిదు కోట్లకి పైగా పోయింది. రెండవ భాగంతో ఆ అయిదు కోట్ల రికవరీ జరిగితే గొప్ప విషయమే అనుకోవాలి. మరి రెండవ భాగానికి ముందే వసూలు చేసిన తొమ్మిది కోట్లు తిరిగిస్తారా లేక ఆ రాయితీ కేవలం లోకల్‌గా వున్న బయ్యర్లకి మాత్రమేనా అనే క్లారిటీ రాలేదింకా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English