అనుష్క విలన్ కి ఛేక్కిచ్చారటగా

అనుష్క విలన్ కి ఛేక్కిచ్చారటగా

బాహుబలి బ్యూటీ అనుష్క నుంచి బాగమతి అనంతరం మరో సినిమా ఇంతవరకు రాలేదు. అయితే సినిమా వస్తే మాములుగా ఉండకూడదు అనుకుందో ఏమో.. కొడితే మినిమమ్ స్టార్ హీరోల లెవెల్లో బాక్స్ ఆఫీస్ హిట్టందుకోవాలని స్వీటీ బలే ప్లాన్ చేసుకుంటోంది. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న కొద్దీ త ఆ క్రేజ్ ను ఇంకా పెంచేసుకుంటోంది.

ఇకపోతే స్వీటీ క్రేజ్ కు ఇప్పుడు హాలీవుడ్ టచ్ కూడా యాడ్ అవ్వనుంది. ఆమె సైలెన్స్ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మైకేల్ మాడ్సేన్ నటించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ కిల్ బిల్ యాక్టర్ని కలిసిన చిత్ర యూనిట్ మొత్తానికి ఎదోలా ఒప్పించి రెమ్యునరేషన్ లో భాగంగా మూడు కోట్ల ఛెక్ ఇచ్చారట. అసలైతే మొదట డేట్స్ విషయంలో అలాగే పేమెంట్ విషయంలో మైకేల్ అభ్యంతరాలు ఏవో తెలిపినట్లు టాక్ వచ్చింది.

ఇక సినిమాను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని కోన వెంకట్ గ్యాంగ్ మైకేల్ తో చర్చలు జరిపి షెడ్యూల్ ని మరోసారి చెక్కి.. ఛెక్ చేతిలో పెట్టేశారట. ఈ హారర్ థ్రిల్లర్ మైకేల్ కి కూడా నచ్చడంతో స్క్రిప్ట్ పై పాజిటివ్ గా ఉన్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో అధికారిక సమాచారం రానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో మాధవన్ - షాలిని పాండే ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English