తండ్రికి చెడ్డ పేరు రాకుండా... బాలయ్య

తండ్రికి చెడ్డ పేరు రాకుండా... బాలయ్య

ఎన్టీఆర్‌ జీవిత కథని తెరకెక్కించిన బాలకృష్ణ బయోపిక్‌ మొదటి భాగం భారీ ఫ్లాప్‌ అవడంతో నిరాశ చెందారు. తండ్రి జీవితాన్ని తెరకెక్కించడానికి నిర్మాతగా మారిన బాలకృష్ణకి దీంతో లాభాలయితే బాగానే వచ్చాయి. కానీ కొన్నవారు మాత్రం రోడ్డు మీదకి వచ్చేసారు. బయ్యర్లకి యాభై కోట్లకి పైగానే నష్టం తెచ్చిన 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' త్వరలో రాబోతోన్న 'ఎన్టీఆర్‌ మహానాయకుడు'పై అంచనాలు తగ్గించేసింది. తండ్రి జీవిత కథ వల్ల బయ్యర్లు నష్టపోరాదని, వారి జీవితాల్లో ఎన్టీఆర్‌ ఒక చేదు గుర్తుగా మిగిలిపోరాదని బాలయ్య ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.

కథానాయకుడు విడుదల చేసిన వారికే మహానాయకుడు హక్కులని కూడా డబ్బులు తీసుకోకుండా ఇచ్చేస్తున్నారట. ఈ చిత్రంతో వారి నష్టాలు భర్తీ కావాలని, వారంతా ఎన్టీఆర్‌ పేరు చెప్పుకోవాలని బాలకృష్ణ ఆశిస్తున్నారు. గతంలో పలువురు నిర్మాతలు, హీరోలు తమ చిత్రాలతో నష్టపోయిన బయ్యర్లకి తక్కువ ధరలకి మరో చిత్రం ఇవ్వడం జరిగింది కానీ ఇలా పూర్తిగా ఒక సినిమా హక్కుల్ని ఇచ్చేయడం ఎన్నడూ జరగలేదు. రెండవ భాగం నుక బాక్సాఫీస్‌ వద్ద క్లిక్‌ అయితే ఎన్టీఆర్‌ బయ్యర్లు అందరూ బాలకృష్ణకి రుణపడిపోతారు. నిర్మాతగా తొలి సినిమాతోనే బాలయ్య తానేమిటనేది నిరూపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English