ఫ్లాప్‌ హీరోయిన్‌కి జోష్‌ వచ్చింది

ఫ్లాప్‌ హీరోయిన్‌కి జోష్‌ వచ్చింది

బాహుబలి చిత్రంలో భాగమైన వారిలో ఎక్కువగా గుర్తింపుకి నోచుకోలేకపోయింది తమన్నానే అనుకోవాలి. బాహుబలి తర్వాత కెరియర్‌ని సరిగ్గా ప్లాన్‌ చేసుకోవడంలో తమన్నా విఫలమయింది. వరుసగా పరాజయాలతో దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. యువ హీరోలు తనతో నటించడానికి ఆసక్తి చూపించకపోవడంతో సీనియర్‌ హీరో వెంకీ సరసకి చేరిపోయింది. ఆ డెసిషన్‌ వల్లే తమన్నాకి మళ్లీ కాస్త జోష్‌ వచ్చింది. ఎఫ్‌ 2 బ్లాక్‌బస్టర్‌ అవడంతో తమన్నా ఇప్పుడు ఆ సక్సెస్‌ని కొనసాగించాలని చూస్తోంది. క్వీన్‌ రీమేక్‌ అయిన 'దటీజ్‌ మహాలక్ష్మి' త్వరలోనే విడుదలకి సిద్ధమవుతోంది.

ఈ టైమ్‌లో తమన్నాకి ఎఫ్‌2తో సక్సెస్‌ రావడం ఆ చిత్రం బిజినెస్‌కి కూడా దోహదపడుతుంది. అయితే ఎఫ్‌2 విజయంలో తమన్నా భాగమెంత అనేది ప్రశ్నార్ధకమే. ఇది పూర్తిగా హీరోల చిత్రం కాగా హీరోయిన్లు ఎవరున్నా పెద్దగా డిఫరెన్స్‌ వుండేది కాదు. పైగా తమన్నా తన నటనతో ఆకట్టుకోలేకపోయింది. కాకపోతే 'గిర్రా గిర్రా' పాటతో పాటు బికినీలో కనిపించి గ్లామర్‌తో మార్కులు కొట్టేసింది. యంగ్‌ మెహ్రీన్‌ కంటే తమన్నా హాట్‌గా వుందనే కితాబులు అందుకుంది. క్వీన్‌ అయితే పర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ వున్న సినిమా కనుక దాంతో తమన్నాకి మళ్లీ మంచి రోజులు వచ్చే అవకాశాలయితే వున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English