మహేష్‌ కంటే ముందు ప్రభాస్‌ చేసేసాడు

మహేష్‌ కంటే ముందు ప్రభాస్‌ చేసేసాడు

జేమ్స్‌బాండ్‌ తరహా చిత్రం చేయాలని మహేష్‌బాబుకి ఎప్పట్నుంచో ప్లాన్‌ వుంది. రాజమౌళి డైరెక్షన్‌లో అలాంటి చిత్రమే చేయాలని యోచన కూడా జరిగింది. అయితే తెలుగు తెరపై అలాంటి చిత్రాన్ని ముందుగా ప్రభాస్‌ చేసేస్తున్నాడు. 'సాహో' చిత్రం హాలీవుడ్‌ జేమ్స్‌ బాండ్‌ సినిమాల తరహాలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. హాలీవుడ్‌ సినిమాల్లో కనిపించే కళ్లు చెదిరే కార్‌ ఛేజ్‌లు, గన్‌ ఫైట్స్‌ సాహో నిండా వుంటాయట.

ఇలాంటి సినిమా ఈ స్థాయిలో ఇంతవరకు ఇండియన్‌ స్క్రీన్‌పై రాలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ ఎలాంటి చిత్రం చేస్తే దేశ వ్యాప్తంగా క్రేజ్‌ వస్తుందనేది ఆలోచించి ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేసారు. అయితే మహేష్‌ ఇలాంటి సినిమా చేయాలని ఎప్పట్నుంచో వెయిట్‌ చేస్తున్నాడు. సాహోతో అది ప్రభాస్‌ చేసేసాడు కనుక మరి మహేష్‌తో రాజమౌళి ఎలాంటి చిత్రం ప్లాన్‌ చేస్తాడనేది ఆసక్తిరరమే. 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత ఒప్పందం ప్రకారం రాజమౌళి తన మలి చిత్రాన్ని మహేష్‌-దుర్గా ఆర్ట్స్‌కి చేయాలి.

బాహుబలి ముందే ఈ రెండు చిత్రాలకి రాజమౌళి అడ్వాన్సులు తీసుకోవడం వల్ల రీజనల్‌ సినిమాకే పరిమితమయ్యాడు. మహేష్‌తో చేసే చిత్రం పూర్తయ్యాక రాజమౌళి పూర్తిస్థాయి హిందీ చిత్రాన్ని చేస్తాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English