ఏమిటో ఈ మాయ అనుకోవాల్సిందే

ఏమిటో ఈ మాయ అనుకోవాల్సిందే

రాజకీయాల్లో సేకనుకో ఆలోచన భవిష్యత్తును మార్చేసినట్లు సినీ ఇండస్ట్రీలో కూడా వేసే ప్రతి అడుగు మాట్లాడే ప్రతి మాట ఎంతో కొంత ఇమేజ్ ని హెచ్చు తగ్గులు చేస్తుండవచ్చు. ప్రస్తుతం బాలకృష్ణ అండ్ నాగబాబు ఈష్యు జనాల్లో ఎలాంటి అనుమానాలకు దారి తీస్తుందో గాని ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక మాయ ప్రపంచమే అని అర్ధమవుతోంది. ఒకరు విమర్షిస్తుంటే మరొకరు కౌంటర్ ఇవ్వడం రొటీన్ అయ్యింది. అందుకే విమర్శలకు సైలెంట్ గా ఉంటూ కొత్త అర్ధాన్ని ఎదో చెబుతున్నారు.

నాగబాబు ఎన్ని విమర్శలు చేసినా కూడా బాలకృష్ణ సైలెంట్ గానే ఉంటున్నాడు. పైగా రీసెంట్ గా పాల్గొన్న రానా దగ్గుబాటి టాక్ షోలో మెగాస్టార్ జగదేక వీరుడు అతిలోక సుందరి తనకు ఇష్టమైన చిత్రమని చెప్పడం విశేషం. అలాగే తాను చిరంజీవి ఫ్యాన్ అన్నట్లు మాట్లాడుతుండడం షాకింగ్. అంతా బాగానే ఉంది గాని బాలకృష్ణ మళ్ళీ బయటకి వచ్చేసరికి టంగ్ స్లిప్ అవుతుంటారు. ఇక నాగబాబు లాంటి వాళ్ళు అలాంటి మాటలకి హార్టయ్యి వారి స్టయిల్ల్లో గట్టిగా కౌంటర్లు వీసురుతుంటారు.

రోజుకో సీన్ ను గుర్తు చేసే ఈ గొడవలు చూసిన తరువాత వీళ్ళ ప్రేమలు చూసి.. ఏమిటో అంతా ఒక మాయలా ఉంటుందని సగటు ఆడియెన్స్ లో ఒక ఆలోచన రాకుండా ఉండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English