పోర్చుగల్ లో మన్మథుడు.. ఇది పక్కా

పోర్చుగల్ లో మన్మథుడు.. ఇది పక్కా

టాలీవుడ్ లో కొత్తగా వచ్చే యువ దర్శకులు కరెక్ట్ గా ప్లాన్ చేస్తే స్టార్ హీరోలతో అవకాశం దక్కించుకోవచ్చు అని నిరూపించాడు రాహుల్ రవీంద్రన్. ఫేడ్ అవుట్ అయిపోతున్న సుశాంత్ లాంటి హీరోతో చి.ల.సౌ అనే సినిమా చేసి పెద్ద హీరోతో లక్కీ చాన్స్ కొట్టేశాడు. బడా ఫ్యామిలిలో చిన్న హీరోని పెట్టుకొని మంచి సినిమా చేస్తే చాలు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా టాలెంట్ కి తగ్గ అవకాశం వెతుక్కుంటూ వస్తుందని నాగార్జున ద్వారా తెలిసొచ్చింది.

గత కొంత కాలంగా నాగార్జునతో రాహుల్  ఒక సినిమాను ప్లాన్ చేస్తున్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మన్మథుడు 2 అని కూడా టాక్ వచ్చింది. అయితే నాగ్ ఆ ప్రయోగం చేయడం రిస్క్ అని కామెంట్స్ వచ్చినప్పటికీ రాహుల్ చెప్పిన స్క్రిప్ట్ కి మమ్మథుడు ఫిదా అయిపోయాడు. ఇటీవల ఫైనల్ స్క్రిప్ట్ ను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగార్జున త్వరలోనే సినిమాను మొదలుపెట్టాలని కూడా చెప్పేశాడు. అందుకే ఫస్ట్ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ పోర్చుగల్ దేశంలో ప్లాన్ చేసిందట.

మంచి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రావు రమేష్ కీలకాపాత్రలో కనిపించనున్నాడు. ఇక త్వరలోనే హీరోయిన్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. మరి మన్మథుడు స్థాయిలో ఈ సీక్వెల్ కథ ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే మొదటి టీజర్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English