ఎన్టీఆర్ vs యాత్ర: పరిస్థితేంటి?

ఎన్టీఆర్ vs యాత్ర: పరిస్థితేంటి?

రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో చలిలో మరింత వేడిని పెంచడానికి బయోపిక్స్ సిద్ధమయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ మహనాయకుడు - వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన యాత్ర సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందో అని అంతా ఎదురుచూస్తున్న సమయంలో పోటీ నుంచి మహనాయకుడు డ్రాప్ అవ్వడం యాత్ర సినిమాపై ఎఫెక్ట్ పడినట్లు అనిపిస్తోంది.

నిజానికి మొదటి నుంచి యాత్రపై పెద్దగా అంచనాలు ఏమి లేవు. టీజర్ అండ్ ఇతర ఫొటోస్ కి పెద్దగా రెస్పాన్స్ కూడా రాలేదు. దీంతో సినిమా ప్రమోషన్ ఏ విధంగా పెంచుదామనుకున్నా కూడా చిత్ర యూనిట్ కి అవకాశమే దొరకలేదు. దీంతో ఎన్టీఆర్ మహనాయకుడు రిలీజ్ ఫిబ్రవరి 7న ఉండగా ఒక్కరోజు తరువాత సినిమాను రిలీజ్ చేసి పోటీలో నిలిస్తే బెటర్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ మహనాయకుడు వారం రోజులు దాటి మరో డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దీంతో యాత్ర సింగిల్ గానే ఉండడంతో పోటీ ఏమి లేదని అంతా మాట్లాడుకోవడం తగ్గించేశారు.

బజ్ లేని సమయంలో యాత్ర పై జనాల చూపు తగ్గింది. మేకింగ్ వీడియోలు అంటూ ఎదో నామమాత్రపు ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇక కథానాయకుడు బెడిసి కొట్టినా మహనాయకుడిపై అయితే అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ పోటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English