వస్తున్నాం.. కొడుతున్నాం.. మిస్సయిందే

వస్తున్నాం.. కొడుతున్నాం.. మిస్సయిందే

వస్తున్నాం.. కొడుతున్నాం.. కొన్నేళ్లుగా అక్కినేని వారి సినిమాల వేడుకల్లో తరచుగా ఈ మాట వినిపిస్తోంది. ముందుగా ‘సోగ్గాడే చిన్నినాయనా’ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ.. ఈ సినిమా ఫలితంపై ధీమాగా ఈ మాట అన్నాడు. అది ఎవ్వరూ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. దీంతో నాగార్జున తమ సినిమాల ప్రతి వేడుకలో ఆ మాట అనడం మొదలుపెట్టాడు. కానీ ‘రారండోయ్’ వేడుక చూద్దాం మినహాయి అన్నీ తుస్సుమనిపించాయి.

ఒక దశ దాటాక ఈ స్లోగన్ కామెడీ అయిపోయింది. అఖిల్ రెండో సినిమా ‘హలో’కు ఇదే మాట అని నాగ్ కామెడీ అయిపోయాడు. సినిమా తుస్సుమనిపించడంతో సోషల్ మీడియాలో జనాలు గట్టిగా ట్రోల్ చేశారు. అందులోనూ ఆ వేడుకలో నాగ్.. అఖిల్‌ను రీలాంచ్ చేస్తున్నట్లు కూడా చెప్పి ట్రోలర్స్‌కు మంచి కంటెంట్ ఇచ్చాడు. ఆ సినిమా పోవడంతో అఖిల్‌ను ఈసారి రీరీలాంచ్ చేస్తాడంటూ సెటైర్లు వేశారు. ఈ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకునో ఏమో.. నాగ్ ఈసారి అధిక ప్రసంగాలేమీ చేయలేదు.

వస్తున్నాం కొడుతున్నాం.. అనే మాటే అనలేదు. అసలు ‘మిస్టర్ మజ్ను’ ఫలితం గురించి కూడా ఏమీ మాట్లాడలేదు. ఈ సినిమాకు కూడా నాగ్ అన్నీ దగ్గరుండి చూసుకున్నట్లు అఖిల్ చెప్పాడు కానీ.. నాగ్ మాత్రం సినిమా అలా ఉంది ఇలా ఉంది అంటూ స్టేట్మెంట్లు ఏమీ ఇవ్వలేదు. సింపుల్‌గా మాట్లాడి సెలవు తీసుకున్నాడు. మరోవైపు అఖిల్ సైతం సినిమా గురించి గొప్పలేమీ పోలేదు. ముందు ఏవేవో మాటలు మాట్లాడటం ఎందుకని.. ఏదైనా సినిమానే మాట్లాడితే బాగుంటుందని తండ్రీ కొడుకులు లేటుగా అర్థం చేసుకున్నట్లున్నారు. అందుకే సినిమా గురించి కంటే వేరే విషయాల గురించి ఎక్కువగా మాట్లాడి వేదిక దిగేశారు. మరి వీళ్లు ఆశించినట్లు ‘మిస్టర్ మజ్ను’ సినిమానే మాట్లాడుతుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English