క్రిష్‌లో ‘మణికర్ణిక’ టెన్షన్

క్రిష్‌లో ‘మణికర్ణిక’ టెన్షన్

టాలీవుడ్లో మంచి ట్రాక్ రికార్డున్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. తక్కువ బడ్జెట్లలో సినిమాలు చేసి.. అందుకు తగ్గట్లుగా బిజినెస్ చేయించడంలో నేర్పరిగా క్రిష్‌కు పేరుంది. ఇక ఔట్ పుట్ విషయంలోనూ ప్రతిసారీ క్రిష్ ప్రశంసలే అందుకున్నాడు. ప్రేక్షకులు పెట్టే రూపాయికి గిట్టుబాటు చేయించేవాడు. దీంతో చాలా వరకు అతడి సినిమాలు కమర్షియల్‌గానూ విజయవంతమయ్యాయి. కానీ ‘యన్.టి.ఆర్’ విషయంలో మాత్రం ఫలితం తేడా కొట్టేసింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర దారుణ ఫలితం ఎదురైంది. బయ్యర్లు రూ.70 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే అందులో మూడో వంతు కూడా వెనక్కి రాని పరిస్థితి. రూ.50 కోట్ల దాకా నష్టం తెచ్చిన మూడు సినిమాల్లో ఒకటిగా ‘యన్.టి.ఆర్’ చెత్త రికార్డు సొంతం చేసుకుంది. దర్శకుడిగా క్రిష్‌కు ఇది పెద్ద పరాభవమే.

‘యన్.టి.ఆర్-కథానాయకుడు’కి ఇలాంటి ఫలితం వచ్చిన నేపథ్యంలో ‘మహానాయకుడు’ విషయంలో మాత్రం అద్భుతాలు జరిగిపోతాయన్న ఆశలేమీ లేవు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణలో ఉన్న క్రిష్ టీంలో అసలు ఉత్సాహం  కనిపించడం లేదని సమాచారం. ఇలాంటి తరుణంలోనే క్రిష్ మధ్యలో విడిచి పెట్టిన బాలీవుడ్ మూవీ ‘మణికర్ణిక’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం జనవరి 25న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా ఫలితంపై కంగనా అండ్ టీంలోనే కానీ.. క్రిష్‌లోనూ టెన్షన్ ఉంటుందనడంలో సందేహం లేదు. క్రిష్ బయటికి వచ్చిన కొత్తలో ఈ సినిమా క్రెడిట్ అంతా అతడిదే అని.. తాను కొంచెం ప్యాచ్ వర్క్ మాత్రమే చేస్తున్నానని అన్న కంగనా.. తర్వాత స్వరం మార్చింది. దర్శకత్వంలో 70 శాతం క్రెడిట్ తనదే అంది. మరి క్రిష్ వదిలేశాక ఈ సినిమాను కంగనా మెరుగు పరిచిందా.. చెడగొట్టిందా అన్నది బాక్సాఫీస్ ఫలితాన్ని బట్టి అర్థమవుతుంది. సినిమా ఆడితే క్రిష్‌ను తప్పించడం వల్ల నష్టమేం జరగలేదని.. కంగనా గ్రేట్ అని అంటారందరూ. అలా కాకుండా సినిమా పోతే.. కంగనను తిడతారు. క్రిష్‌ను పక్కన పెట్టి తప్పు చేశారని అంటారు. తన సినిమా పోవాలని క్రిష్ కోరుకుంటాడా అన్నది సందేహమే కానీ.. అది ఆడితే మాత్రం ఇప్పుడున్న స్థితిలో అతడికి ఇబ్బందికరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English