‘భారతీయుడు’ రజనీ చేసి ఉంటే..

‘భారతీయుడు’ రజనీ చేసి ఉంటే..

దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌ల కెరీర్లలో ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమా ‘భారతీయుడు’. 90ల చివర్లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. కేవలం దక్షిణాదినే కాకుండా దేశవ్యాప్తంగా ఈ చిత్రం చర్చనీయాంశమైంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమాల్లో ఇదొకటని చెప్పాలి. ఈ సినిమాలో కమల్ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. గొప్ప నటుడైన కమల్‌కు శంకర్ లాంటి మేటి దర్శకుడు తోడవడంతో బాక్సాఫీస్ షేకైపోయింది.

మరి కమల్‌తో చేస్తేనే ఈ సినిమా అంతటి విజయం సాధించిందంటే.. అందులో రజనీకాంత్ కథానాయకుడిగా చేస్తే ఎలా ఉండేది? ఈ ఊహే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తోంది కదూ. నిజానికి శంకర్ ముందుగా ‘భారతీయుడు’ సినిమా చేయాలనుకున్నది రజనీతోనే అట. ఈ విషయాన్ని శంకర్ శిష్యుడు.. దర్శకుడు అయిన వసంత బాలన్ వెల్లడించాడు.

శంకర్ తొలి సినిమా ‘జెంటిల్‌మేన్‌’ చూసి ఇంప్రెస్‌ అయిన రజనీ.. తన కోసం ఒక స్క్రిప్టు రెడీ చేయాలని అన్నాడట. దీంతో శంకర్ ఆయన కోసం ‘పెరియ మనుషన్‌’ పేరుతో ఒక కథ రాశాడట. రజనీకి ఈ కథ నచ్చినప్పటికీ.. అప్పటికే వేరే సినిమాలకు సంతకం చేయడంతో వెంటనే ఈ చిత్రం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారట. ఆ తర్వాత కమల్‌ను శంకర్‌ కలిసి ఈ కథ చెప్పడం.. ఆయన ఓకే చెప్పడంతో సినిమా చేశాడట. ఆ కథే ‘ఇండియన్’గా తెరకెక్కిందని వసంత బాలన్ వెల్లడించాడు.

ఇంకో విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్న శంకర్.. సేనాపతి పాత్రకు రాజశేఖర్‌ను.. కొడుకు పాత్రకు నాగార్జున లేదా వెంకటేష్‌ల్లో ఒకరిని తీసుకోవాలనుకున్నటుల కూడా వసంతబాలన్ చెప్పడం విశేషం. కానీ తర్వాత ఆలోచన మార్చుకుని ‘ఇండియన్’నే ‘భారతీయుడు’ పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English