అక్కినేని గూటికి చేరిపోయాడు

అక్కినేని గూటికి చేరిపోయాడు

'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంతో పరిచయం అయిన దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ వెంటనే అదే బ్యానర్లో 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రం చేసాడు. వరుసగా రెండు ఘన విజయాలు అందుకున్న కళ్యాణ్‌ కృష్ణ మూడవ చిత్రం కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే చేయాల్సి వుంది. అయినా కానీ అక్కినేని నీడలోంచి బయటకి వచ్చి సొంతంగా హిట్‌ ఇద్దామని 'నేల టిక్కెట్టు' తీసాడు. ఆ చిత్రం డిజాస్టర్‌ అవడంతో కళ్యాణ్‌ కృష్ణ టాలెంట్‌పై డౌట్స్‌ రైజ్‌ అయ్యాయి. దాని తర్వాత అతనికి అవకాశాలేమీ రాకపోవడంతో మరోసారి అక్కినేని కాంపౌండ్‌లోకే వెళ్లిపోయాడు. అప్పట్లో అనుకున్న 'సోగ్గాడే చిన్ని నాయనా' సీక్వెల్‌ని ఇప్పుడు మెటీరియలైజ్‌ చేయాలని చూస్తున్నాడు.

'బంగార్రాజు' టైటిల్‌తో రూపొందే ఈ చిత్రంలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తారట. అంటే చైతన్యకి తాతయ్య పాత్రలో నాగ్‌ కనిపిస్తారట. తాతయ్య పాత్ర అయినా కానీ నాగ్‌ యంగ్‌ గెటప్‌లోనే కనిపిస్తారట. అంటే బంగార్రాజు పాత్ర చనిపోయింది కనుక చనిపోయేటపుడు వున్న వయసులోనే నాగ్‌ లుక్‌ వుంటుంది. దాదాపుగా సోగ్గాడే థీమ్‌లోనే ఈసారి ఇంకాస్త ఎంటర్‌టైనింగ్‌గా, లైవ్‌లీగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. చైతన్య 'వెంకీ మామ' పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English