దిల్‌ రాజుకి ఇద్దరూ దొరికేసారు

దిల్‌ రాజుకి ఇద్దరూ దొరికేసారు

తమిళ చిత్రం 96 రీమేక్‌ చేసి తీరాలని దిల్‌ రాజు పట్టుబడితే అతనికి ఇంతవరకు హీరో దొరకలేదు. తమిళంలో విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఆ చిత్రానికి తెలుగులో కూడా లీడ్‌ పెయిర్‌ కీలకమని దిల్‌ రాజుకి తెలుసు. అందుకే తనకి పరిచయం వున్న హీరోలందరికీ ఈ చిత్రాన్ని చూపించాడు. అయితే అందరూ ఏవో సినిమాలతో బిజీగా వుండడంతో 96 మొదలు కాలేదు. ఎఫ్‌2 ఇచ్చిన సక్సెస్‌తో ఊపు మీద వున్న దిల్‌ రాజు తాను రొటీన్‌ సినిమాలు తీస్తున్నాడనే అపవాదు తొలగించుకోవడానికి 96 రీమేక్‌పై దృష్టి పెట్టాడు. ఫైనల్‌గా ఈ రీమేక్‌లో నటించడానికి శర్వానంద్‌,  సమంత ఇద్దరూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసారు. విశేషమేమిటంటే 96 చిత్రాన్ని చూసినపుడు దీనిని రీమేక్‌ చేయరాదని సమంత అభిప్రాయపడింది. ఇలాంటి చిత్రాలని రీమేక్‌ చేయకపోతేనే మంచిదని ఆమె స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. కానీ ఇప్పుడు దిల్‌ రాజుకే ఆమెతోనే రీమేక్‌ చేయబోతున్నాడు. అయితే ఈ చిత్రం సుమంత్‌ నటించిన మళ్ళీ రావా చిత్రానికి దగ్గరగా వుంటుందనేది చాలా మంది అభిప్రాయం. ఆ చిత్రంలో స్టార్‌ కాస్ట్‌ వీక్‌ అవడం వల్ల ఎక్కువ మందికి రీచ్‌ అవలేదు. దిల్‌ రాజు భారీగా ప్లాన్‌ చేస్తున్నాడు కనుక ఇది తెలుగులోను క్లాసిక్‌ అనిపించుకుంటుందేమో చూద్దాం. తమిళంలో 96 తీసిన ప్రేమ్‌ కుమార్‌ తెలుగు వెర్షన్‌ కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు. అతి త్వరలోనే ఈ చిత్రం అనౌన్స్‌మెంట్‌ అఫీషియల్‌గా చేస్తారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English