వరుణ్‌ తేజ్‌ హ్యాండ్‌ ఇచ్చేసాడు!

వరుణ్‌ తేజ్‌ హ్యాండ్‌ ఇచ్చేసాడు!

అంతరిక్షం ఫ్లాప్‌ అవడంతోనే హరీష్‌ శంకర్‌తో వరుణ్‌ తేజ్‌ చేద్దామని అనుకున్న జిగర్తాండ రీమేక్‌ డౌట్‌లో పడింది. విలన్‌ పాత్ర పోషించడానికి ఓకే అన్న వరుణ్‌ తేజ్‌ 'అంతరిక్షం' ఫ్లాపయ్యాక పునరాలోచనలో పడ్డాడు. ఎఫ్‌2 సక్సెస్‌తో అతనికి క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ప్రయోగాల కంటే మార్కెట్‌ని సుస్థిరం చేసుకోవడం ముఖ్యమని తెలుసుకున్నాడు. అదీ కాక తన చేతిలో ఆల్రెడీ రెండు ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్టులున్నాయి. ఈ టైమ్‌లో విలన్‌ అంటూ తీవ్రమైన ప్రయోగాలు చేయడం ఉత్తమం కాదని వరుణ్‌కి మెగాస్టార్‌తో సహా మిగతా కుటుంబ సభ్యులు హితబోధ చేసారట.

దీంతో వరుణ్‌ తేజ్‌ ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదనే టాక్‌ వినిపిస్తోంది. దీంతో మరోసారి హరీష్‌ శంకర్‌ కథ మొదటికి వచ్చింది. డిజె తర్వాత అతను చేద్దామని అనుకున్న దాగుడు మూతలు స్క్రిప్టుని పక్కనపెట్టి జిగర్తాండ రీమేక్‌కి మార్పులు చేపట్టిన హరీష్‌ శంకర్‌కి ఇప్పుడు హీరో దొరికితే కానీ పని జరిగేట్టు లేదు. దిల్‌ రాజు క్యాంపునుంచి బయటకి వచ్చేసి అనిల్‌ సుంకర వద్ద అడ్వాన్స్‌ తీసుకున్న హరీష్‌ శంకర్‌ ఎవరైనా ఫామ్‌లో వున్న హీరో డేట్స్‌ తెచ్చుకుంటే తప్ప సినిమా మొదలు పెట్టలేడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English