అల్లు అర్జున్‌ భారం తీర్చిన చరణ్‌

అల్లు అర్జున్‌ భారం తీర్చిన చరణ్‌

'రంగస్థలం' ఘన విజయం తర్వాత అల్లు అర్జున్‌లో చాలా మార్పు వచ్చిందని క్లోజ్‌ సర్కిల్సే చెబుతున్నాయి. అంతవరకు దిలాసాగా వున్న అల్లు అర్జున్‌కి రంగస్థలంతో షాక్‌ తగిలింది. చరణ్‌ వరుసగా నిరాశ పరుస్తూ వుండడంతో, తన గ్రాఫ్‌ బాగుండడంతో మెగా ఫ్యామిలీ నుంచి నెక్స్‌ట్‌ టాప్‌ స్టార్‌ బన్నీ అవుతాడని మీడియా కూడా అభిప్రాయ పడింది. కానీ చరణ్‌ ఒకే సినిమాతో అందరి నోళ్లు మూయించేసాడు.

సరిగ్గా అప్పుడే అల్లు అర్జున్‌కి కూడా 'నా పేరు సూర్య'తో ఫ్లాప్‌ పడింది. దీంతో మరింతగా షెల్‌లోకి వెళ్లిపోయిన అల్లు అర్జున్‌ ఇంతవరకు కొత్త సినిమా మొదలు పెట్టనే లేదు. ఎనిమిది నెలలుగా ఖాళీగానే వున్నాడు. ఈ టైమ్‌లో 'వినయ విధేయ రామ' కూడా హిట్‌ అయితే అల్లు అర్జున్‌ మరింత జాగ్రత్త పడిపోయేవాడు. కానీ ఆ చిత్రం ఫ్లాప్‌ అవడంతో అల్లు అర్జున్‌కి కాస్త రిలీఫ్‌ లభించినట్టే. చరణ్‌ మలి చిత్రం వచ్చే యేడాదిలో కానీ రాదు కనుక అల్లు అర్జున్‌ ఈలోగా మళ్లీ ఓ పెద్ద హిట్‌ ఇచ్చి తన కాన్ఫిడెన్స్‌ తిరిగి పొందవచ్చు. కాకపోతే చరణ్‌నుంచి తర్వాత రాబోయేది రాజమౌళి చిత్రం కనుక ఇప్పట్లో చరణ్‌ని దాటి వెళ్లడం అల్లు అర్జున్‌కి సాధ్యం కాకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English