జబర్దస్త్‌లోకి ఆది రీ ఎంట్రీ

జబర్దస్త్‌లోకి ఆది రీ ఎంట్రీ

తెలుగునాట పాపులర్‌ ప్రోగ్రామ్‌ జబర్దస్త్‌. దాదాపు ఆరేళ్ల నుంచి టాప్‌ పొజిషన్‌లో ఉన్న ఈ కార్యక్రమంలో చాలామంది కమెడీయన్స్‌ వచ్చారు, వెళ్లారు. ఎంట్రీ, రీ ఎంట్రీ అనేది జబర్దస్త్‌లో చాలా కామన్‌. కానీ జబర్దస్త్‌ గతినే మార్చిన వాడు హైపర్‌ ఆది.  

పేరుకు తగ్గట్లుగానే హైపర్‌ పంచ్‌లతో అదరగొట్టేస్తాడు. ఇంకా చెప్పాలంటే.. ఆది వచ్చిన తర్వాత యూట్యూబ్‌లో జబర్దస్‌ ప్రోగ్రామ్‌కి వ్యూస్‌ మిలియన్లు దాటాయి. అలాంటి ఆది.. సడన్‌గా జబర్దస్త్‌ నుంచి తప్పుకున్నాడు.

హైపర్‌ ఆది లాంటి స్టార్‌ కమెడీయన్‌ తప్పుకునేసరికి.. ఆది ఎగ్జిప్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల కథనాలు విన్పించాయి. జనసేనకు ప్రచారం చేస్తుండడంతో.. అతడ్ని తీసేశారని వార్తలు వచ్చాయి. మరోవైపు.. టీడీపీ పార్టీ నుంచి ప్రెషర్‌ ఎక్కువ అవ్వడంతో ఆదినే తప్పుకున్నాడని మరో గాసిప్‌ విన్పించింది. ఇంకొంతమంది అయితే.. సినిమాల్లో బిజీ అయిపోయాడని.. ఇక జబర్దస్త్‌కు వచ్చే అవకాశాలనే లేదని అన్నారు.

ఫైనల్‌గా అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ.. మూడు నెలల గ్యాప్‌ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే అదిరిపోయే లెవల్లో పంచ్‌లు పేల్చాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను మల్లెమాల రిలీజ్ చేసింది. వచ్చేవారం ఈ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కాబోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English