ఇండియన్-2.. వరమా? భారమా?

ఇండియన్-2.. వరమా? భారమా?

భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.545 కోట్ల భారీ బడ్జెట్లో ‘2.0’ చిత్రాన్ని నిర్మించింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. కానీ వాళ్లు పెట్టిన ఖర్చు మరీ ఎక్కువ అని రిలీజ్ తర్వాత కానీ అర్థం కాలేదు. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు. విడుదల తర్వాత టాక్ బాగుంటే పెట్టుబడి చాలా వరకు రికవర్ అవుతుందిలే అని ఆశించారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. ఆల్రెడీ జరిగిన అమ్మకాలకు తగ్గట్లు బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావడమే కష్టమైంది. ఇక ఓవర్ ఫ్లోస్ మీద ఎలా ఆశలు పెట్టుకునేది. విడుదలకు ముందే శాటిలైట్ డీల్స్ చేసుకోవడం కొంత వరకు మంచిదైంది. మొత్తంగా చూస్తే ‘2.0’ నిర్మాతలకు నష్టం తప్పలేదని సమాచారం. అయినప్పటికీ నిరాశ పడకుండా శంకర్ కొత్త సినిమా ‘ఇండియన్-2’ను కూడా వాళ్లే టేకప్ చేశారు.

‘2.0’తో వచ్చిన నష్టాల్ని భర్తీ చేయడానికి లైకా వాళ్లకే శంకర్ ‘ఇండియన్-2’ చేస్తున్నాడా.. లేక వేరే నిర్మాత దొరక్క వీళ్లతో ముందుకు సాగుతున్నాడా అన్నది అర్థం కాని విషయం. నిజానికి ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో చేయాలని శంకర్ అనుకున్నాడు. కానీ రూ.200 కోట్ల బడ్జెట్, అనుకున్న ప్రకారం సినిమా మొదలయ్యేలా లేకపోవడం.. ఇవన్నీ చూసి రాజు సైడైపోయాడు. తమిళం నుంచి మరో నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది కానీ.. తర్వాత వెనక్కి తగ్గింది. ఈ స్థితిలో లైకా వాళ్లు ఎంటరయ్యారు. వేరే నిర్మాణ సంస్థను శంకరే తప్పించి లైకా వాళ్లను లైన్లో పెట్టాడని అంటారు. ఏదేమైనప్పటికీ శంకర్ ‘ఐ’.. ‘2.0’ సినిమాల మాదిరి అవసరానికి మించి ఖర్చు చేయించి.. సరైన ట్ పుట్ ఇవ్వకుంటే లైకా వాళ్లకు మరో దెబ్బ ఖాయం. ‘2.0’ నష్టాలు భర్తీ కాకపోగా.. కొత్త నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. మరి ‘భారతీయుడు-2’ను తమ చేతుల్లోకి తీసుకోవడం లైకా వాళ్లకు వరం అవుతుందా.. భారం అవుతుందా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English