30 ప్లస్ హీరోయిన్ల జోరు మామూలుగా లేదు

30 ప్లస్ హీరోయిన్ల జోరు మామూలుగా లేదు

30ల్లోకి పడితే హీరోయిన్ల కథ ముగిసినట్లే అన్నట్లుండేది ఒకప్పుడు పరిస్థితి. కానీ ఇప్పుడు 30 ప్లస్ హీరోయిన్లదే హవా అన్నట్లుంది. నయనతార, త్రిష, శ్రియ, అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత.. ఇలా 30 ఏళ్లకు అటు ఇటుగా ఉన్న హీరోయిన్లు చాలామంది ఇంకా ఉనికిని చాటుకుంటున్నారు. వరుస అవకాశాలతో సాగిపోతున్నారు. ముఖ్యంగా నయనతార ఊపు చూసి అందరూ షాకైపోతున్నారు. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌తో దూసుకెళ్తోందామె. నయన్‌తో పోలిస్తే మధ్యలో త్రిష ఊపు తగ్గింది కానీ.. ఇప్పుడు తమిళనాట ఆమెకు క్రేజ్ మామూలుగా లేదు.

విజయ్ సేతుపతితో కలిసి త్రిష నటించిన ‘96’ సినిమాతో త్రిష ఫేట్ మారిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు.. త్రిషకు చాలా గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఇందులో వయసుకు తగ్గ పాత్రలో నటించడం ద్వారా దర్శకులు, రచయితలు తన కోసం భిన్నమైన పాత్రలు రాయొచ్చన్న సంకేతాలిచ్చింది. ఆ రకమైన పాత్రలతో చాలామంది త్రిషను కలుస్తున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన తొలిసారి త్రిష నటించిన ‘పేట’ కూడా హిట్టవడంతో త్రిష క్రేజ్ ఇంకా పెరిగింది. ఆమె చేతిలో ఇప్పుడు అర డజను దాకా సినిమాలున్నట్లు సమాచారం. ఒక దశలో సినిమా అవకాశాలు పెళ్లి చేసుకుని సెటిలైపోవాలనుకుంది త్రిష. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇంత ఫాలోయింగ్ సంపాదించుకోవడం ఆశ్చర్యమే.

మరోవైపు ‘పేట’లో రజనీకి జోడీగా నటించిన మరో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్‌కు కూడా మళ్లీ క్రేజ్ కనిపిస్తోంది. దీనికి ముందే ‘సీమ రాజా’లో విలన్ పాత్రతో మెప్పించిన సిమ్రాన్.. రజనీ సినిమా అనగానే మళ్లీ గ్లామర్ మీద కూడా దృష్టిపెట్టింది. మళ్లీ సెక్సీగా కనిపించి అభిమానుల్ని అలరించింది. ‘పేట’లో సిమ్రాన్‌ను చూసి మెచ్చి.. మాధవన్ హీరోగా నటించబోయే కొత్త సినిమాలో ఆమెను కథానాయికగా ఎంచుకున్నారట. వీళ్లిద్దరూ గతంలో ‘అమృత’ అనే గొప్ప సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. 42 ఏళ్ల వయసులో మళ్లీ మాధవన్ సరసన సిమ్రాన్ జంటగా నటించబోతుండటం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English