సెలబ్రెటీలు ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచిపోతారు?

సెలబ్రెటీలు ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచిపోతారు?

ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ హాట్ టాపిక్ అవుతోంది. ఆమె కార్లోంచి దిగుతున్న ఒక ఫొటో చూసి ఒక నెటిజన్ చేసిన కామెంట్ వివాదానికి దారి తీసింది. కార్లో సెషన్ అయ్యాక రకుల్ ప్యాంట్ మరిచిపోయి కిందికి దిగేసిందంటూ ఆ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి రకుల్ ఘాటుగా బదులిచ్చింది. మీ అమ్మ కూడా అలాంటి సెషన్లే చేయడం వల్ల నీకు బాగా తెలిసినట్లుందంటూ తీవ్ర స్థాయిలో ఆ నెటిజన్ మీద విరుచుకుపడింది. ఐతే ఆ వ్యక్తికి ఇంగిత జ్ఞానం లేక కామెంట్ చేస్తే.. రకుల్ అతడి తల్లిని వివాదంలోకి లాగి అభ్యంతకర కామెంట్లు చేయడంపై దుమారం రేగింది. రివర్సులో జనాలు రకుల్‌ను తిట్టడం మొదలుపెట్టారు. కొందరు రకుల్ చేసింది కరెక్ట్ అంటుండగా.. ఇంకొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు.

ఐతే ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. సోషల్ మీడియా అన్నాక అందరూ ఉత్తములే ఉండరు. అదొక సముద్రం. ఐడెంటిటీ లేని మారు వేషగాళ్లు అక్కడ కోట్లమంది ఉంటారు. వారు ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. సెలబ్రెటీల మీద నీచాతి నీచంగా కామెంట్లు చేసి పైశాచికానందం పొందే వ్యక్తులు కోకొల్లలుగా ఉంటారు. సలెబ్రెటీలు ఒక ఫొటో పెట్టినా.. ఒక కామెంట్ పెట్టినా వాటికి వందలు వేలల్లో కామెంట్లు వస్తాయి. అందులో సగానికి సగం బూతులుంటాయి. ఎంత మంచి ఇమేజ్ ఉన్న సెలబ్రెటీకైనా ఈ నెగిటివ్ కామెంట్లు తప్పవు. హీరోయిన్ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. అన్ని కామెంట్లూ సెక్సిస్ట్ కేటగిరీవే. ప్రతి కామెంట్‌నూ పట్టించుకుంటే అంతే సంగతులు. ఇలాంటి వాటిని లైట్ తీసుకుని ముందుకు సాగిపోవాలంతే. ఇలాంటి వాటికి హర్టయి... బదులిచ్చుకుంటూ పోతే ఇంకే పని చేయడం కుదరదు. అలా హర్టయ్యేలా ఉంటే.. అసలు సోషల్ మీడియాలో ఉండటమే కష్టం. ఇది ఒక రొచ్చు అని తెలిసే సెలబ్రెటీలు ఇందులోకి వస్తారు. వచ్చాక బాధ పడితే కష్టం. అలాంటి కామెంట్లను ఎవ్వరూ సమర్థించరు. అదే సమయంలో వాటిని పట్టించుకుని డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. తమ గురించి వచ్చిన వందలాది కామెంట్లలో ఇలాంటి ఒక వివాదాస్పద వ్యాఖ్యనే తీసుకుని దాని మీద స్పందించి.. వార్తల్లో నిలవడానికి, అటెన్షన్ తెచ్చుకోవడానికి ప్రయత్నించే సెలబ్రెటీలు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English