అనుష్క ఇక బికినీలకి దూరం

అనుష్క ఇక బికినీలకి దూరం

అరుంధతిగా నటించిన తర్వాత కూడా అనుష్క బిల్లా చిత్రంలో బికినీలో కనిపించి అదరగొట్టింది. అటు పర్‌ఫార్మెన్స్‌ ప్రధాన పాత్రలు, ఇటు గ్లామర్‌ పాత్రలు సమానంగా మెప్పించిన అతి కొద్ది మంది తారల్లో ఒకరయిన అనుష్క 'బాహుబలి' తర్వాత ఇక తన పంథా మార్చేసుకుంది. ఇకపై అన్నీ పర్‌ఫార్మెన్స్‌ ప్రధాన పాత్రలే చేస్తానంటోంది. గ్లామరస్‌ పాత్రలు చేసే ఆలోచన ఇక లేదని తేల్చేసింది. తన వయసుకి తగ్గట్టు గౌరవప్రదమైన పాత్రలు పోషిస్తానని, గ్లామర్‌కి దూరంగా వుంటానని చెబుతోంది. తెరపై ఎలా కనిపించినా, తెర వెనుక మాత్రం చాలా పద్ధతిగా డ్రస్‌ చేసుకునే అనుష్క ఇక తెరపై కూడా అలాగే వుండాలనుకుంటోంది. భాగమతి లాంటి చిత్రాలు ఎక్కువగా చేయాలని చూస్తోంది. హీరోలతో కలిసి నటించడం కంటే సోలోగా నటించడానికే అనుష్క ఎక్కువ ఇష్టపడుతోంది. ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో భాగం పంచుకుంటానని, ఎక్కువగా హీరోయిన్‌ ప్రధాన చిత్రాలు చేస్తానని అనుష్క అంటోంది. బరువు తగ్గడం కోసం కొంత విరామం తీసుకున్న అనుష్క మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది కూడా భాగమతి లాంటి చిత్రంతోనే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English