జూనియర్ సమంత ఏమైపోయిందబ్బా!!

జూనియర్ సమంత ఏమైపోయిందబ్బా!!

స్టార్ హీరోయిన్ గా క్లిక్ అవ్వాలంటే కొండంత కష్టంతో పాటు రవ్వంత అదృష్టం కూడా ఉండాలి అంటారు సినీ జనాలు. అందంతో ఐశ్వర్య రాయ్ ని మించిన అవకాశాలు వచ్చినా కూడా బ్యాడ్ లక్ పక్కనే ఉంటే ఏమి చేయలేము. ప్రస్తుతం కన్నడ బ్యూటి నాభా నతేష్ పరిస్థితి కూడా అలానే ఉంది. గత ఏడాది సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో మంచి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అందంతో అందరిని ఎట్రాక్ట్ చేసింది.

ఆ సినిమా రిలీజవ్వగానే 'జూనియర్ సమంత' అంటూ చాలా పొగడ్తలు బాగానే అందుకుంది. ఆఫర్స్ అందుకోవడానికి పెద్దగా సమయం పట్టేలా లేదు.. స్టార్ హీరోయిన్స్ కి పోటీని ఇచ్చే బ్యూటీ వచ్చిందని కూడా అన్నారు.  కానీ బేబీ సైన్ చేసిన సినిమాలు మొదలవ్వడానికి నానా తంటాలు పడుతున్నాయి. రవితేజ - విఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ ఇప్పటికే మొదలవ్వాలి. కాని ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా తెలియదు. ఇక రీసెంట్ గా ఎపి ఎంపి, మహేష్‌ బావ జయదేవ్ గల్లా పెద్ద కొడుకు అశోక్ గల్లా హీరోగా మొదలైన మూవీ కూడా ఆగిపోయినట్లు టాక్ వస్తోంది. అందులో కూడా నాబానే హీరోయిన్.

ఆ రెండు సినిమలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెంగుళూరు చిన్నదానికి ఇప్పుడు చిరాకు వస్తోందట. దిల్ రాజు ప్రొడక్షన్ లో మహేష్ మేనల్లుడు గల్లా జయదేవ్ అనగానే క్రేజ్ బాగానే వచ్చింది. కానీ సినిమా స్క్రిప్ట్ పనులు సరిగ్గా లేకపోవడం వల్ల ఆగింది. ఇక రవితేజ సినిమాకు కూడా అదే పరిస్థితి. మాస్ రాజా మార్కెట్ పడిపోవడం, డైరక్టర్ కు కావల్సినంత బడ్జెట్ సమకూర్చే పరిస్థితి లేకపోవడంతో, సినిమా ఆగిందంటున్నారు.  మరి ఈ భామ ఇక నుంచి అయినా కొంచెం బెటర్ అండ్ గ్యారెంటీ ప్రాజెక్టులను చూసుకుంటే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English