రాజమౌళి మారిపోయాడు

రాజమౌళి మారిపోయాడు

స్నేహితుల కోసం, శ్రేయోభిలాషుల కోసం, మొహమాటాల కోసం ఇంతకుముందు రాజమౌళి మాట సాయం చేసేవాడు. ఏదైనా సినిమా విడుదలైనపుడు తన ఫీడ్‌బ్యాక్‌ చెప్పడం రాజమౌళికి అలవాటు. సాయి కొర్రపాటి సినిమాలకయితే ఎలాంటి జంకు లేకుండా బాగుందనేసేవాడు. కానీ బాహుబలి తర్వాత రాజమౌళిని జాతీయ వ్యాప్తంగా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇదివరకటిలా మొహమాటాలకి పోయి అల్లాటప్పా సినిమాల గురించి గొప్ప మాటలు చెప్పలేడు.

అందుకే రాజమౌళి మొహమాటాలు విడిచిపెట్టేసి ఎంత ప్రతిష్టాత్మక చిత్రాలు వచ్చినా, తనకి అత్యంత ఆప్తులైన వారి చిత్రాలు విడుదలైనా కానీ సైలెంట్‌గా వుంటున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ గురించి రాజమౌళి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషమే అనాలి. మహేష్‌ ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా అభివర్ణించిన తర్వాత రాజమౌళి ఈజీగా బాగుందని ఒక మాట అని వుండవచ్చు. కానీ సాయి కొర్రపాటి అసోసియేట్‌ అయినా కానీ సైలెంట్‌గానే వుండిపోయాడు. రాజమౌళితో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా దీని గురించి ఏమీ మాట్లాడకపోవడం సర్వత్రా చర్చనీయాంశమయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English