పవన్‌ కళ్యాణ్‌ ఫన్నీ డైలాగ్‌

పవన్‌ కళ్యాణ్‌ ఫన్నీ డైలాగ్‌

పవన్‌ కళ్యాణ్‌ సినిమా నిర్మాణంలో ఉందంటే అతని ఫాన్స్‌ అంతా తమ రచనా పటిమకి పదును పెడతారు. పవన్‌ సినిమా నిర్మాణంలో ఉండగా ఇందులో ఫలానా డైలాగ్‌ ఉందంటూ ప్రచారం జరగడం సర్వ సాధారణం అయిపోయింది. గబ్బర్‌సింగ్‌కి, కెమెరామెన్‌ గంగతో రాంబాబుకి ఫాన్స్‌ రాసిన డైలాగ్స్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో బాగా ప్రచారమయ్యాయి. అయితే అవేమీ సినిమాలో లేవనుకోండి. తాజాగా పవన్‌ సినిమా 'అత్తారింటికి దారేది'లో డైలాగులంటూ కొన్ని ప్రచారంలోకి వస్తున్నాయి.

ఇవి సినిమాలో ఉంటాయో లేదో తెలీదు కానీ ప్రస్తుతానికి నెట్‌ ప్రపంచంలో హల్‌చల్‌ సృష్టిస్తున్నాయి. ఓ సీన్‌లో పవన్‌తో సమంత 'నువ్వు చాలా సెల్‌ఫిష్‌ తెలుసా?' అంటే దానికి బదులుగా 'మనకి సెల్‌ఫిష్‌గా ఉండడం చిన్నప్పుడు స్కూల్లోనే నేర్పించారు. రోడ్డుకి రెండు పక్కలా అశోకుడు చెట్లు నాటించారు అని చెప్పారు కానీ దానికి మధ్యలో ఉన్న రోడ్డు బ్రిటిష్‌ వాళ్లు వేయించారని చెప్పారా' అని పవన్‌ అంటాడట. ఇది సినిమాలో డైలాగో కాదో కానీ వినడానికి మాత్రం ఫన్నీగా ఉంది దూ!


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English