తమన్నా హాట్ సాంగ్ కావాలట

తమన్నా హాట్ సాంగ్ కావాలట

మొన్నటి వరకు ఐరెన్ లెగ్ అనిపించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఎన్ని విమర్శలు వచ్చినా అవకాశాలను బాగానే అందుకుంటూ వస్తోంది. రిజల్ట్ సంగతి పక్కనపెట్టి కెరీర్ ను ఒక లెవెల్లో సెట్ చేసుకుంటూ రావడంలో తమన్నా బెస్ట్ అనిపించుకుంటోంది. ఇకపోతే F2 సక్సెస్ లో అమ్మడి పాత్ర బాగానే వర్కౌట్ అయ్యింది. మెయిన్ గా గ్లామర్ టచ్ కుర్రకారును బాగా ఎట్రాక్ట్ చేసింది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ధన్ ధన్ ప్రోమో సాంగ్ బాగా ప్రమోట్ అవుతోంది. ఈ సాంగ్ లో తమన్నా చాలా హాట్ గా ఉందంటూ ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు. అయితే తమన్నా గిర్రా గిర్రా సాంగ్ లో గ్లామర్ డోస్ గట్టిగానే ఉంది. దీంతో ఆ సాంగ్ కావాలి ప్లీజ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మొత్తానికి తమన్నా చాలా రోజుల తరువాత తన క్రేజ్ ను మరో లెవెల్ కి పెంచుకుంది. అందుకే ఇలా ఫ్యాన్స్ కూడా వుయ్ వాంట్ హర్ అంటూ హడావుడి చేస్తున్నారు.

మిల్కీ బ్యూటీ నార్మల్ గా స్టెప్పెస్తేనే ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక దానికి తోడు ఇంత హాట్ గా కనిపిస్తే మరోసారి సినిమాకు వెళ్లాల్సిందే అని అనకుండా ఉంటారా?. అవసరమైతే సినిమాకు సీక్వెల్ వస్తే అందులో కూడా నటించాలని ఉందని చిత్ర యూనిట్ కి కూడా హాట్ బ్యూటీ ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా ఇష్టంతో చేస్తే ఎంత బాగా వర్కౌట్ అవుతుందో తమన్నా చెప్పకనే చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English