హాని ఈజ్ ద బెస్ట్.. ఐడియా ఎవరిదంటే..

హాని ఈజ్ ద బెస్ట్.. ఐడియా ఎవరిదంటే..

సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్ లో విన్నర్ గా నిలిచిన F2 మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. హీరోలతో పాటు హీరోయిన్స్ కి కూడా చాలా రోజుల తరువత సక్సెస్ దక్కడంతో వరుసగా ఇంటర్వ్యూలతో సినిమా గురించి సరికొత్త విశేషాలను అభిమానులకు తెలియజేస్తున్నారు.

ఇక దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలో బాగా క్లిక్ అయిన ఓ సీన్ గురించి వివరణ ఇచ్చాడు. అదే 'హాని ఈజ్ ద బెస్ట్'. వరుణ్ కి జోడిగా నటించిన మెహ్రీన్ గతంలో ఎప్పుడు లేని విధంగా ఓ సరికొత్త క్యారెక్టర్ తో ఆడియెన్స్ ని అలరించింది. అయితే ఆ మ్యానేరిజం కాపీ రైట్స్ ఓ చిన్నారివే అంటూ దర్శకుడు అనిల్ తెలియజేశాడు. సక్సెస్ మీట్ లో తప్పకుండా ఆ పాపతో ఈ సీన్ ను చేయిస్తాడట. మెహ్రీన్ కంటే ఆ పాప చేస్తే ఇంకా బావుంటుందని చెప్పాడు.

రాజా ది గ్రేట్ లో సెకండ్ హాఫ్ లో నటించిన ఓ చైల్డ్ ఆర్టిస్ రోజు దర్శకుడికి గుడ్ మార్నింగ్ చెప్పగానే.. హానీ ఈజ్ ద బెస్ట్ అని క్యూట్ గా హావభావాలను కనబరిచేదట. దీంతో అనిల్ ఈ మ్యానేరిజంతో హీరోయిన్ తో చేయిస్తే బావుంటుందని వెంటనే ఆ సీన్ ను F2 లో దింపినట్లు అనిల్ తెలిపారు. అంతే కాకుండా తప్పకుండా ఆ పాపకు ఓ గిఫ్ట్ కూడా ఇస్తానని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English