మొత్తానికి క్రిష్ నోరు విప్పాడు

మొత్తానికి క్రిష్ నోరు విప్పాడు

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ బాలీవుడ్ లో కూడా స్టార్ డైరెక్టర్ మారే చాన్స్ వచ్చిందని మణికర్ణిక సినిమాతో ఋజువవుతుందని అంతా అనుకున్నారు. కానీ క్రిష్ మెయిన్ పార్ట్ అంతా అయిపోయి చివరి దశలో డ్రాప్ అవ్వడం అందరిని షాక్ కి గురిచేసింది. ఓ వైపు కంగనా నేనే చాలా వరకు డైరెక్ట్ చేశాను అంటుంటే దానికి కౌంటర్ గా క్రిష్ కూడా సమాధానం ఇచ్చాడు.

అయితే ఈ ఝాన్సీ లక్ష్మీ బాయ్ బయోపిక్ నుంచి క్రిష్ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ఓ కారణాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. మెయిన్ రీజన్ అయితే చెప్పలేదు గాని చిత్ర యూనిట్ తో స్క్రిప్ట్ విషయంలో విభేదాలు వచ్చినట్లు చెప్పకనే చెప్పాడు. ప్రాజెక్టు ఇతరుల చేతుల్లోకి వెళ్ళడంతో చరిత్రను వక్రీకరించేలా మార్పులు  జరిగాయని సోనూసూద్ ని తప్పించి మరో యాక్టర్ ని సెలెక్ట్ చేశారని, ముఖ్యమైన సన్నివేశాలను మరో యాక్టర్ తో రీ షూట్ చేశారని క్రిష్ చెప్పాడు. దీంతో చాలా వరకు క్రిష్ చేతుల్లో నుంచి కథానాయిక కంగనా మైక్ లాగేసుకుని స్క్రిప్ట్ లో వేలు పెట్టడం అసలు వివాదాలకు దారి తీసింది. అలాంటి వర్క్ ని ఏ మాత్రం ఇష్టపడని క్రిష్ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయ్యాడట.

ఇక ఈ దర్శకుడికి కంగనాతో పాటు మణికర్ణిక సినిమా టైటిల్ క్రెడిట్ అయితే ఇచ్చారు. ఏదేమైనా కూడా ఫైనల్ గా ఆ ప్రాజెక్టు గురించి క్రిష్‌ నోరు విప్పాడు కాబట్టి అందరూ హ్యాపీసే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English