మళ్లీ నందమూరి-మెగా క్లాష్

మళ్లీ నందమూరి-మెగా క్లాష్

బాక్సాఫీస్ దగ్గర మెగా-నందమూరి క్లాష్ జరిగితే ఆ మజానే వేరు. ఏడాదిలో ఒక్కసారైనా ఈ పోరు చూస్తుంటాం. వరుసగా మూడేళ్లూ సంక్రాంతికి మెగా-నందమూరి బాక్సాఫీస్ పోరు చూశాం. ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ సినిమా ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’తో రామ్ చరణ్ చిత్రం ‘వినయ విధేయ రామ’ పోటీ పడింది. వీటిలో ఏది పైచేయి సాధించిందో చెప్పలేని పరిస్థితి. ‘యన్.టి.ఆర్’కు టాక్ బాగుంటే కలెక్షన్లు లేవు. ‘వీవీఆర్’కు బ్యాడ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ బాగున్నాయి. థియేట్రికల్ రన్ ముగిశాక ఎవరిది పైచేయి అన్నది తేలుతుంది. ఇదిలా ఉంటే ిఇంకో నెలన్నరలో మరోసారి మెగా-నందమూరి పోరు చూడబోతున్నాం.

కానీ ఆ పోరు అంత ప్రతిష్టాత్మకమైందేమీ కాదు. రెండు ఫ్యామిలీలకు చెందిన స్ట్రగ్లింగ్ హీరోలు అప్పుడు అమీతుమీ తేల్చుకోబోతున్నారు. వాళ్లే.. నందమూరి కళ్యాణ్ రామ్, అల్లు శిరీష్. వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్న కళ్యాణ్ రామ్.. తన ఆశలన్నీ థ్రిల్లర్ మూవీ ‘118’ మీదే పెట్టుకున్న సంగతి తెలిసిందే. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కె.వి.గుహన్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 25కే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆలస్యమైంది. ఈ చిత్రాన్ని మార్చి 1న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవలే ప్రెస్ నోట్ ఇచ్చారు.

మరోవైపు ఇంతకుముందు ఫిబ్రవరి 8కి షెడ్యూల్ అయిన అల్లు శిరీష్ సినిమా ‘ఏబీసీడీ’ సైతం వాయిదాపడింది. మార్చి 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త పోస్టర్ వదిలారు. మలయాళ హిట్ మూవీ ‘ఏబీసీడీ’కిది రీమేక్. సంజీవ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. తెలుగులో నాలుగు సినిమాలు చేసి ఒకటే హిట్టు కొట్టిన శిరీష్‌కు కూడా ఈ సినిమా చాలా కీలకం. మరి ఆ మెగా-నందమూరి పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English