వాళ్లిద్దరికీ ఊపిరి పోసిన సినిమా

వాళ్లిద్దరికీ ఊపిరి పోసిన సినిమా

వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్న ఇద్దరు హీరోయిన్లకు ఒక సినిమా ఊపిరి పోసింది. ఈసారి తేడా వస్తే కెరీరే ప్రమాదంలో పడిపోయే స్థితిలో ‘ఎఫ్-2’ చిత్రం తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదాలకు గొప్ప ఊరటనిచ్చింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ తర్వాత తమన్నాకు ఓ మోస్తరు సక్సెస్ కూడా లేదు. ఆ సినిమాతో కెరీర్ మరో స్థాయికి చేరుకుంటుందని ఆమె ఆశిస్తూ.. కథ మొత్తం రివర్స్ అయింది. వరుస ఫ్లాపులకు తోడు తన స్థాయికి తగ్గ అవకాశాలు లేక.. ఇక ఇండస్ట్రీని ఖాళీ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది.

ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ‘నా నువ్వే’.. ‘నెక్స్ట్ ఏంటి’ లాంటి చిత్రాలు తమన్నాకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మరోవైపు మెహ్రీన్ పరిస్థితి మరీ దారుణం. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’.. ‘మహానుభావుడు’.. ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి లక్కీ హీరోయిన్ అనిపించుకున్న మెహ్రీన్.. ఆ తర్వాత వరుసగా అరడజనుదాకా ఫ్లాపులు చూసింది. చివరగా ఆమె కనిపించిన ‘కవచం’ కూడా డిజాస్టర్ కావడంతో మెహ్రీన్ కెరీర్ ప్రమాదంలో పడింది.

ఇలాంటి స్థితిలో తమన్నా, మెహ్రీన్ ఆశలన్నీ ‘ఎఫ్-2’ మీదే నిలిచాయి. ఈ చిత్రం వాళ్లిద్దరికీ సంతోషాన్ని తెచ్చింది. మంచి టాక్‌తో మొదలైన ‘ఎఫ్-2’ బ్లాక్ బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది. ఊరికే హిట్టవడమే కాదు.. వీళ్లిద్దరికీ మంచి పేరు కూడా తెచ్చిందీ చిత్రం. తమన్నా, మెహ్రీన్ ఇద్దరికీ ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కాయి. ఇద్దరూ పెర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకున్నారు. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఇద్దరూ ఓ రేంజిలో అందాల ప్రదర్శన చేశారు. సినిమాకు ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయానికి విజయం, పేరుకు పేరు రెండూ రావడంతో ఈ హీరోయిన్లిద్దరూ చాలా ఖుషీగా ఉన్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English