వావ్.. ‘గజని’కి సీక్వెల్!

వావ్.. ‘గజని’కి సీక్వెల్!

ఒకప్పుడు సూర్య అనేవాడు తమిళంలో చిన్న హీరో. అతడి గురించి తమిళనాడు అవతల పెద్దగా తెలిసేది కాదు. దర్శకుడు మురుగదాస్ పరిస్థితి కూడా అంతే. ఐతే వీళ్లిద్దరినీ ఒక సినిమా ఇండియా ఫేమ్ చేసింది. వాళ్లకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఆ చిత్రమే.. గజని. 2005లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.

తమిళం నుంచి అనువాదం చేసి తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసి కాసుల పంట పండించుకున్నాడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కు తీసుకెళ్లింది కూడా ఆయనే. హిందీ హక్కులు కూడా ముందే కొని పెట్టుకున్న అరవింద్.. ఆమిర్ ఖాన్ లాంటి పెద్ద స్టార్‌ను పెట్టి మురుగదాస్ దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని నిర్మించాడు. అక్కడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.

ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘గీతా ఆర్ట్స్’ బేనర్ మీద ఫిలిం ఛాంబర్లో ‘గజిని-2’ అనే టైటిల్ రిజిస్టర్ కావడం విశేషం. అల్లు అరవింద్ టైటిల్ రిజిస్టర్ చేశారంటే ఊరికే అలా టైటిల్ పడి ఉంటుందని చేసి ఉండరు. కచ్చితంగా ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లే.

మరి ఈ చిత్రాన్ని ఏ భాషలో తీస్తారు.. ఎవరితో తీస్తారన్నది ఆసక్తికరం. దర్శకుడిగా కచ్చితంగా మురుగదాసే ఉండే అవకాశముంది. మరి తనకు మంచి మిత్రుడు అయిన సూర్యనే పెట్టి ఈ సీక్వెల్ చేస్తాడేమో అరవింద్ చూడాలి. ‘గజిని’ సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇది క్రేజీ ప్రాజెక్టు అవుతుంది. మరి ‘గజిని-2’ ఎప్పుడు పట్టాలెక్కి.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English