బికినీ ఇంటర్వ్యూపై స్వాతి ఏమందంటే?

బికినీ ఇంటర్వ్యూపై స్వాతి ఏమందంటే?

కలర్స్ స్వాతికి ముందు నుంచి ట్రెడిషనల్ ఇమేజ్ ఉంది. ప్రతి సినిమాలోనూ సంప్రదాయ బద్ధంగానే కనిపించిందామె. తెలుగుతో పాటు తమిళం, మలయాళ చిత్రాల్లోనూ నటించిన స్వాతి.. అన్ని చోట్లా పద్ధతిగానే కనిపించింది. అస్సలు స్కిన్ షో చేయలేదు. ఒక దశ వరకు మడి కట్టుకుని కూర్చునే హీరోయిన్లు.. అవకాశాలు తగ్గిపోతున్నపుడు, కెరీర్ చరమాంకంలో అందాల ప్రదర్శన చేస్తుంటారు.

కానీ స్వాతి మాత్రం అలా చేయలేదు. చివర్లో కూడా ఎక్స్‌పోజింగ్ జోలికి వెళ్లలేదు. అలాంటి అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తూ ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం అందరికీ పెద్ద షాకిచ్చింది. పెళ్లి తర్వాత మరింత పద్ధతిగా తయారవుతుంటారు హీరోయిన్లు. అలాంటిది స్వాతి ఇంత బోల్డ్‌గా తయారవడమేంటో అర్థం కాలేదు.

ఇదే విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్వాతిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పింది. నిజానికి తనకు పెళ్లి తర్వాతే ఎక్కువ ఫ్రీడమ్ ఉందని చెప్పింది. పెళ్లికి ముందు ప్రతి విషయానికీ భయపడేదాన్నని.. ఎవరేమనుకుంటారో.. ఎవరికేం సమాధానం చెప్పాలో అని కంగారు పడేదాన్నని ఆమె చెప్పింది. పెళ్లి తర్వాత అర్థం చేసుకునే భర్త దొరకడంతో తనకు ఫ్రీడమ్ వచ్చిందని ఆమె చెప్పింది. సినిమాలను తన భర్త ఒక కెరీర్‌గానే చూస్తారని.. ప్రొఫెషన్ కోసం ఎలా కనిపించినా ఆయనకు ఇబ్బంది లేదని ఆమె అంది.

సాధారణంగా తాను బికినీ వేసుకుని స్విమ్ చేస్తానని.. ఎప్పుడూ చేసే పనిని ఇంటర్వ్యూలో చూపించడానికి ఏమీ అభ్యంతరం లేకపోయిందని.. కానీ తాను అందులో వల్గర్‌గా ఏమీ కనిపించలేదని స్వాతి చెప్పింది. అప్పుడు తన భర్త కూడా పక్కనే ఉన్నాడని.. మళ్లీ ఎప్పుడు సినిమాల్లో నటిస్తావంటూ నవ్వుతూ ప్రశ్నించారని కూడా స్వాతి అంది. ఊరికే సరదాకే అలా కనిపించా తప్ప అందులో మరో ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English